వర్మ ఈసారి వాయిదాలతో పబ్లిసిటీ కానిచ్చేస్తున్నాడా?  

Bhairava Geetha Goes Postponed For This Sankranthi-bhairava Geetha Release Date,rgv,viral About Rgv

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తన సినిమాలకు ఏ రకంగా అయినా ప్రమోషన్‌ చేసుకోగలడు. పబ్లిసిటీ ఖర్చు లేకుండా ఎప్పుడు కూడా ఆయన తన సినిమాను వార్తల్లో ఉంచుతాడు. తాజాగా ఆయన నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘భైరవగీత’...

వర్మ ఈసారి వాయిదాలతో పబ్లిసిటీ కానిచ్చేస్తున్నాడా?-Bhairava Geetha Goes Postponed For This Sankranthi

కన్నడంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. కన్నడం కంటే కూడా అధికంగా ఫోకస్‌ను తెలుగులోనే వర్మ పెట్టాడు. ఈ చిత్రాన్ని మొదట అరవింద సమేత చిత్రంకు పోటీగా దసరాకు విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.

అయితే ఆ సినిమా అప్పటి నుండి విడుదల వాయిదా పడుతూనే వస్తోంది.

దసరా తర్వాత దీపావళి అన్న వర్మ దీపావళికి కూడా విడుదల చేయలేక పోయాడు. మొన్నటికి మొన్న సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ మూవీ 2.ఓ కు పోటీగా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. 2.ఓ విడుదలైన ఒక్క రోజుకు తన భైరవ గీతను విడుదల చేస్తానంటూ ప్రకటించాడు.

అయితే ఆ తేదీకి కూడా వర్మ విడుదల చేయలేదు. తాజాగా ఈ చిత్రంను డిసెంబర్‌ 7న విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా ప్రకటించాడు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరోసారి వాయిదా వేసే అవకాశం కనిపిస్తుంది. డిసెంబర్‌ 14న ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలున్నాయని అంటున్నారు...

సినిమా వాయిదాలు పడుతున్నా కొద్ది సినిమా గురించి జనాల్లో చర్చ ఎక్కువ అవుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు, ట్రైలర్‌ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది.

ఇక వాయిదాల మీద వాయిదాలు అంటూ రోజు వార్తల్లో ఈ చిత్రం నిలుస్తున్న కారణంగా ప్రేక్షకులు కూడా ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారు. ఈసారి వాయిదాల మీద వాయిదాలు వేయడం వల్ల వర్మ ఫ్రీ పబ్లిసిటీని దక్కించుకుంటున్నాడు. మొత్తానికి వర్మ ఏం చేసినా కూడా పబ్లిసిటీ కోసమే అంటూ మరోసారి ఈ వాయిదాల కారణంగా వెళ్లడయ్యింది...