బాలయ్య చెల్లి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పావురాలు అనే సినిమా ద్వారా ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నారు నటి భాగ్యశ్రీ.ఎన్నో అద్భుతమైన సినిమాలలో తన అందచందాలతో ఎంతో అనుకువగా,తన వస్త్రధారణలో ఏమాత్రం హద్దులు దాటకుండా నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు నటి భాగ్యశ్రీ.

 Bhagyashree Is Setting The Internet On Fire With Swimsuit-TeluguStop.com

ఇక తెలుగులో బాలకృష్ణ నటించినటువంటి యువ‌ర‌త్న రాణా సినిమాలో బాలకృష్ణ చెల్లెలిగా నటించి మంచి గుర్తింపు పొందారు.అదేవిధంగా రాజశేఖర్ హీరోగా ఓంకారం అనే సినిమాలో నటించి ప్రత్యేకమైన గుర్తింపు పొందారు.

ఇలా అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి విశేష ఆదరణ సంపాదించుకున్న భాగ్యశ్రీ ఇప్పటికీ అదే అందచందాలతో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు.తాజాగా భాగ్యశ్రీ ప్రభాస్ హీరోగా నటిస్తున్న అటువంటి రాధేశ్యామ్చిత్రంలో ప్రభాస్ కి తల్లిగా నటిస్తూ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

 Bhagyashree Is Setting The Internet On Fire With Swimsuit-బాలయ్య చెల్లి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం 52 సంవత్సరాల వయసున్న భాగ్యశ్రీ ఇప్పటికి ఎంతో ఆరోగ్యవంతంగా అందంతో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

Telugu Balakrishna, Bhagyashree, Bhgya Sree, Mother Character, Prabhas, Radhya Shyam, Swimsuit, Tollywood-Movie

వయసు పైబడిన ఆమెలో ఏమాత్రం అందం తగ్గలేదని తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలను చూస్తే తెలుస్తోంది.భాగ్యశ్రీ తాజాగా త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఆమె స్విమ్ సూట్‌ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఒకటికి రెండుసార్లు చూస్తూ ఈమె నిజంగానే భాగ్యశ్రీ నేనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నో సినిమాలలో ఏ విధమైనటువంటి ఎక్స్పోజింగ్ లేకుండా నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన భాగ్యశ్రీను ఇప్పుడిలా స్విమ్ సూట్ లో చూసే సరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.నిన్న‌టి త‌రం హిందీ న‌టి షీబాతో పాటు మ‌రికొంత‌మంది ఫ్రెండ్స్‌తో క‌లిసి స్విమ్మింగ్‌పూల్‌లో ఎంజాయ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

#Swimsuit #Bhgya Sree #Balakrishna #Prabhas #Radhya Shyam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు