బాహుబలికి అమ్మనయ్యే భాగ్యం దక్కిందంటున్న భాగ్యశ్రీ...  

Senior Actress Bhagyashree Reacts About Her Jaan Movie Offer-bhagyashree And Prabhas,bhagyashree Movie Latest Update,bhagyashree News,bollywood Actress Bhagyashree,jaan Movie Upadte

బాలీవుడ్ లో “మైనే ప్యార్ కియా” చిత్రంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి తనకంటూ ఓ ముద్ర వేసుకున్న టువంటి బాలీవుడ్ భామ భాగ్యశ్రీ.అయితే తాజాగా ఈ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న “జాన్” సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించే ఛాన్స్ కొట్టేసింది.

Senior Actress Bhagyashree Reacts About Her Jaan Movie Offer-Bhagyashree And Prabhas Bhagyashree Latest Update News Bollywood Upadte

అయితే తాజాగా ఈ విషయంపై భాగ్యశ్రీ స్పందించారు.

జాన్ సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించే అవకాశం రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని,  అలాగే బాహుబలి ప్రభాస్ కి అమ్మనయ్యే భాగ్యం తనకే దక్కిందని చెప్పుకొచ్చారు భాగ్యశ్రీ.

అంతేగాక జక్కన్న ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన టువంటి బాహుబలి చిత్రం కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు భాగ్యశ్రీ.

గతంలో ప్రభాస్ నటించిన టువంటి బాహుబలి చిత్రాన్ని చూశానని అందులో ప్రభాస్ అద్భుతంగా నటించాడని అంతేగాక ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ప్రభాస్ అని కొనియాడారు.

అయితే భాగ్యశ్రీ మరో తెలుగు చిత్రంలో కూడా నటిస్తున్నారు.తాజాగా అడవి శేష్ నటిస్తున్న చిత్రంలో కూడా అడివి శేష్ కి తల్లి పాత్రలో నటిస్తున్నారు.ఏదేమైనప్పటికీ తెలుగులో మాత్రం భాగ్యశ్రీ మంచి అవకాశాలు దక్కించుకుంటోంది.

ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలుగొందినటువంటి భాగ్యశ్రీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

తాజా వార్తలు

Senior Actress Bhagyashree Reacts About Her Jaan Movie Offer-bhagyashree And Prabhas,bhagyashree Movie Latest Update,bhagyashree News,bollywood Actress Bhagyashree,jaan Movie Upadte Related....