ఈ దసరా కానుకగా మన టాలీవుడ్( Tollywood ) లో మూడు పెద్ద సినిమాలు విడుదల అవుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.అఖండ మరియు వీర సింహా రెడ్డి వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి తో చేసిన ‘భగవంత్ కేసరి’.‘విక్రమ్ ‘ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ కనకరాజ్( Lokesh Kanakaraj ) తమిళ హీరో విజయ్ తో చేసిన ‘లియో’( Leo ) అలాగే రవితేజ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన ‘టైగర్ నాగేశ్వర రావు’.ఈ మూడు సినిమాలు దసరా కానుకగా విడుదల కాబోతున్నాయి.
వీటిల్లో తమిళ ఆడియన్స్ తో పాటుగా తెలుగు ఆడియన్స్ కూడా ఒక రేంజ్ లో ఎదురు చూస్తున్న చిత్రం ‘లియో’.ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, ట్రైలర్ అన్నీ సూపర్ హిట్ అయ్యి యూత్ ని ఆకట్టుకోవడంతో మూవీ పై క్రేజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకుంది.
నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో మొదలయ్యాయి.బుకింగ్స్ ప్రారంభించిన వెంటనే గంటకి 83 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి.అలా 24 గంటలకు కలిపి 6 లక్షల 50 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి.ఇది ఆల్ టైం ఇండియన్ రికార్డు.కేవలం తమిళ వెర్షన్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రమే కాదు, తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదిరిపోతున్నాయి.టికెట్స్ ఓపెన్ చేసిన నిమిషాల వ్యవధిలోనే హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోతున్నాయి.
మన టాలీవుడ్ స్టార్ హీరోల కొత్త సినిమాలు విడుదల అయితే ఎలా ఉంటుందో, ఈ సినిమాకి కూడా అదే రేంజ్ బుకింగ్స్ జరిగాయి.ఇక ఈ సినిమాతో విడుదల అవుతున్న బాలకృష్ణ ( Balakrishna )మరియు రవితేజ సినిమాలను జనాలు అసలు పట్టించుకోలేదు.‘టైగర్ నాగేశ్వర రావు’ అడ్వాన్స్ బుకింగ్స్ రెండు రోజుల క్రితం ప్రారంభం అవ్వగా, హైదరాబాద్ లో ఒక్క హౌస్ ఫుల్ కూడా పడలేదు.
ఇక ‘భగవంత్ కేసరి’( Bhagwant Kesari ) చిత్రం పరిస్థితి కూడా ఇంతే, బెంగళూరు సిటీ లో నిన్న అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా, ఇప్పటి వరకు కనీసం వెయ్యి టిక్కెట్లు కూడా అమ్ముడుపోలేదు.మంచి ట్రైలర్ కట్, బాలయ్య బాబు వరుస సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నా కూడా ఈ చిత్రానికి బుకింగ్స్ జరగకపోవడం ఆశ్చర్యాన్ని కలుగచేస్తుంది.ఇదంతా లియో మ్యానియా ప్రభావమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఆడియన్స్ కి మొదటి ఛాయస్ గా ‘లియో’ చిత్రం నిలిచిందని, దాని ప్రభావం బాలయ్య సినిమా మీద పడిందని, ఒకవేళ భగవంత్ కేసరి సోలో రిలీజ్ ఉంటె కచ్చితంగా మంచి ఓపెనింగ్స్ వచ్చేవని అంటున్నారు ట్రేడ్ పండితులు.