విజయవాడ: నందమూరి బాలకృష్ణ, హీరోయిన్స్ శ్రీ లీల, కాజల్ జంటగా నటించిన భగవంత్ కేసరి చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగ ప్రముఖ హోటల్లో సందడి చేసిన చిత్ర బృందం.హీరోయిన్ శ్రీ లీల కామెంట్స్… చిత్రానికి ఇంతటి ఘనవిజయం చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు.
కెరియర్ తొలి రోజుల్లోనే బాలకృష్ణ లాంటి పెద్ద నటుడుతో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నా.తక్కువ సమయంలో మా చిచ్చా… హీరో బాలకృష్ణతో నటించడం చాలా సంతోషంగా ఉంది.
కథ విన్నప్పుడు చాలా ఎక్సైటింగ్ ఫీలయ్యాను.కొత్త క్యారెక్టర్.
అందులోనూ బాలకృష్ణతో నటించడం చాలా సంతోషంగా అనిపించింది.ఇందులో నా క్యారెక్టర్ చాలా విభిన్నమైనది.
ఈ చిత్రంలో తొలిసారిగా ఫైట్స్ చేయడం చాలా థ్రిల్లింగ్ అనిపించింది.ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు అనిల్ కి నా కృతజ్ఞతలు.
దర్శకుడు అనిల్ రావిపూడి కామెంట్స్.ఈ కథ రాసేటప్పుడే బాలకృష్ణ గారు హీరో అనుకొని రాశాను.పెళ్లి సందడి చిత్రంలో శ్రీ లీల యాక్టింగ్ చాలా బాగా అనిపించింది.అప్పుడే ఈ చిత్రానికి తనే కరెక్ట్ నటి అని ఫిక్స్ అయ్యాను.
ఇప్పటివరకు ఏడు చిత్రాలు తీశాను అన్ని ఘన విజయం సాధించాయి.ప్రేక్షకులకు ఎప్పుడు రుణపడి ఉంటాను.
చిత్రాలు సక్సెస్ వచ్చినప్పుడే మరింత జాగ్రత్త భయం పెరుగుతుంది.నెక్స్ట్ చిత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి అనుకుంటాను.
ఈ కథ రాసేటప్పుడు ఫిక్స్ అయ్యాను చిత్రం విజయం అవుతుందని.చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.
చైల్డ్ అబ్యూజింగ్ వల్ల పడే ఇబ్బందులు గురించి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం.ఈ చిత్రాన్ని కచ్చితంగా ప్రతి ఒక్క మహిళలు, కుటుంబ సమేతంగా చూడాలి.