ఖమ్మం మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్ మల్లేశ్వర కు ఆట బాలోత్సవం ఆహ్వానం.

భద్రగిరిలో వచ్చే నెల 12 నుంచి బాలల పండుగ సందర్భంగా రామయ్య సన్నిధిలో బాలోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపి తప్పకుండా రావాలని ఖమ్మం మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్ మల్లేశ్వర కి ఆట బాలోత్సవం ఆహ్వాన పత్రికను నిర్వాహకులు అందజేశారు .చిన్నారుల కళా ప్రదర్శనలు 24 అంశాలు 44 విభాగాల్లో పోటీలు ఉంటాయని .

నేషనల్ లైవ్ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా వచ్చే నవంబర్ 12 నుంచి 14 వరకు శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలోని మిథిలా స్టేడియం ఎదురుగా చిత్రకూట మండపంలో బాలోత్సవం జరుగుతుందని .4 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసు గల బాలబాలికలు పాల్గొనే ఈ వేడుకల్లో మూడు కేటగిరీల్లో పోటీలు జరుగుతాయి .4 - 6 వయసు గల వారిని సబ్ కేటగిరీగా , 7 - 10 మధ్య వారిని జూనియర్లుగా , 11 - 16 మధ్య వయసు గల వారిని సీనియర్లుగా విభజిస్తారని వివరించారు .వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల పరస్పర ఆలోచనల మార్పిడి , స్నేహభావనాకు బాలోత్సవం ఉపయోగపడుతుందని .పిల్లల్లో అంతర్గత నైపుణ్యాలను వెలికి తీసేందుకు దశా కాలంగా భద్రాచలంలో ఆటా బాలోత్సవం నిర్వహిస్తున్నాం అన్ని బాలోత్సవక్కు వచ్చే విద్యార్థులందరికీ ఉచిత వసతి , భోజనం , ఉచిత ఎంట్రీలు కల్పిస్తామన్నారు .ఈ కార్యక్రమంలో అవార్డు టీచర్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ కె.స్ నాయుడు , ఆర్గనైజర్ బుమ్మిసెట్ రమేష్ పాల్గొన్నారు .

తాజా వార్తలు