భద్రాద్రి చరిత్రలో ఇది నిలిచి పోయే రోజు

కరోనా కరాల నృత్యం చేస్తున్న ఈ సమయంలో సామాన్యులు, ధనవంతులతో పాటు దేవుళ్లకు కూడా ప్రభావం కనిపిస్తుంది.నేడు శ్రీరామ నవమి అనే విషయం అందరికి తెల్సిందే.

 Corona Effect On Bhadradri Sri Sita Rama Kalyanam Post Poned, Bhadrachalam, Sri-TeluguStop.com

ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్బంగా దేశ వ్యాప్తంగా పండుగ సంబురాలు అంబరాన్ని తాకుతాయి.అంతటి సంబురాలు జరగాల్సిన ఈ సమయంలో ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం భద్రాద్రిలో రాములవారి కళ్యాణం చేయిస్తుంది.అక్కడ లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం చూసి తరించి పోతారు.

ఈసారి మాత్రం ఆ సన్నివేశం లేదు.కేవలం పదుల సంఖ్యల అయ్యవార్లతో సీతారాముల కళ్యాణం జరుగుతుంది.గ్రామ గ్రామన కూడా రాములవారి కళ్యాణాలు జరిపించడం లేదు.అన్ని విధాలుగా కట్టడి ఉన్న కారణంగా రాముల వారి కళ్యాణంపై ప్రభావం పడినది.

భద్రాద్రి చరిత్రలో భక్తులు లేకుండా రాములవారి కళ్యాణం జరగలేదని, ఇలాంటి దారుణ పరిస్థితులు వస్తాయని ఊహించలేదంటూ భద్రాద్రి అయ్యవారులు అంటున్నారు.ప్రతి ఒక్కరి జీవితాలను భయంకరంగా ప్రభావితం చేస్తున్న ఈ కరోనా వైరస్‌ భారి నుండి నువైనా కాపాడవయ్యా రామయ్యా అని పూజించేందుకు కూడా వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube