భద్ర సినిమాలో ఈ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు “బోయపాటి శ్రీను” దర్శకత్వం వహించిన “భద్ర” చిత్రం ప్రేక్షకులకి బాగానే గుర్తుంటుంది.కాగా ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించగా మలయాళ బ్యూటీ మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించింది.

 Bhadra Movie Fame Sanober Herekar Aziz Real Life-TeluguStop.com

అలాగే ప్రకాష్ రాజ్, ఈశ్వరీ రావు, సుధా, మురళీ మోహన్, సునీల్, బ్రహ్మాజీ, ప్రదీప్ రావత్, సుబ్బ రాజు, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.అయితే ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన “సనోబెర్ హీరేకర్ అజీజ్” ప్రేక్షకులకి బాగానే గుర్తుంటుంది.

అయితే ఏమైందో ఏమోగాని భద్ర చిత్రంలో నటించిన తర్వాత ఈ అమ్మడు మళ్ళీ తెలుగు చిత్రాలలో నటించలేదు.కాగా ప్రస్తుతం “సనోబెర్ హీరేకర్” బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ మ్యూజిక్ సంస్థలో “చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్” గా పని చేస్తున్నట్లు సమాచారం.

 Bhadra Movie Fame Sanober Herekar Aziz Real Life-భద్ర సినిమాలో ఈ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సనోబెర్ హీరేకర్ కి అప్పట్లో కమిట్మెంట్లు మరియు క్యాస్టింగ్ కౌచ్ సంబంధిత విషయాలలో చేదు అనుభవాలు ఎదురవడంతో ఈ అమ్మడు సినిమాలకు గుడ్ బై చెప్పి నట్లు అప్పట్లో పలు వార్తలు బలంగా వినిపించాయి.

Telugu Bhadra Movie, Bhadra Movie Fame Sanober Herekar Aziz Real Life, Bhadra Second Heroine, Boyapati Srinu, Casting Couch, Chief Operating Officer, Commitments, Sanober Herekar Aziz, Ss Music Company, Telugu Actress, Tollywood-Movie

కానీ సనోబెర్ హీరేకర్ మాత్రం ఈ విషయాలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.కాగా ప్రస్తుతం సనోబెర్ హీరేకర్ ముంబై ప్రాంతంలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నట్లు సమాచారం.

అయితే నటనకు గుడ్ బై చెప్పినప్పటినుంచి సనోబెర్ హీరేకర్ సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటోంది.

ఈ క్రమంలో ఎలాంటి సినిమా ఫంక్షన్లకుగాని, ఇతర కార్యకలాపాలకుగాని హాజరు కావడం లేదు.ఏదేమైనప్పటికీ ఈ అమ్మడికి వచ్చీరావడంతోనే నటిగా మంచి గుర్తింపు వచ్చినప్పటికీ అనుకోకుండా సినిమా పరిశ్రమకు దూరం అయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

#BhadraSecond #BhadraMovie #Casting Couch #Commitments #SanoberHerekar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు