OTP స్కామ్ తో జర జాగ్రత్త గురూ...! అజాగ్రత్తగా ఉన్నారో మీ సొమ్ముకి రెక్కలొచ్చేస్తాయ్ !     2019-01-19   00:01:39  IST  Sai Mallula

మోసం మోసం ..! ఇప్పుడు జనాలు తరుచు ఏదో ఒక మోసాలకు గురవుతూనే ఉన్నారు. అంతే కాదు మోసపోయేవారు ఉంటే మోసం చేసేవారికి కొదవే లేదు. ఇంటర్నెట్ ప్రపంచం విస్తారించాక … కేటుగాళ్లు ప్రజల సొమ్ము చాలా సులువుగా కొట్టేస్తున్నారు. అంతే కాదు… ఈ మధ్యన ఆన్‌లైన్ బ్యాకింగ్ మోసాలు కూడా… రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మోసం చేయడం లో కూడా కేటుగాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త పంథాలో మోసాలకు పాల్పడుతోనే ఉన్నారు.

Beware Of Otp Scam-

Beware Of Otp Scam

అన్నిరకాల మోసాలు అయిపోయినట్టు ఇప్పుడు వన్ టైమ్ పాస్‌వర్డ్‌లను సైతం హ్యాకర్లు వదిలిపెట్టడంలేదు. టు-ఫాక్టర్ అథంటికేషన్‌ను కలిగి ఉండే వన్ టైమ్ పాస్‌వర్డ్‌లను అంత సులువుగా హ్యాక్ చేయటం కుదరని పని. అలాంటిది, వీటిని కూడా హ్యాకర్లు రాబట్టేస్తున్నారు. ముఖ్యంగా ఈ తరహా స్కామ్‌కు బెంగుళూరు వాసులు ఎక్కువగా బలైపోతున్నారు. ఈ వన్ టైమ్ పాస్‌వర్డ్‌లను హ్యాకర్లు చాలా స్మార్ట్‌గా దొంగిలించేస్తున్నారు. బాధితుల ఫోన్‌లలో మాల్వేర్‌లను ఇన్‌స్టాల్ చేయటం లేదా బ్యాంక్ ఉద్యోగులుగా పరిచయం చేసుకుని వారి వద్ద నుంచి ఓటీపీలను కొల్లగొట్టేస్తున్నారు. ఈ తతంగం మొత్తం ఎలా జరుగుతుందంటే?

Beware Of Otp Scam-

ముందుగా… బాధితుడికి ఓ వ్యక్తి ఫోన్ చేసి, తాను బ్యాంక్ ఉద్యోగినని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. ఆ తరువాత బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నామంటూ చెబుతారు. ఈ ప్రాసెస్‌లో భాగంగా డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ నెంబర్, సీవీవీ, ఎక్స్‌పైరీ తేదీలను అడుగుతారు. ఇవి తెలుసుకున్న తరువాత ఆయా కార్డులతో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు ఓ ఎస్ఎంఎస్‌ను పంపుతున్నామని, ఆ ఎస్ఎంఎస్‌లో కన్ఫర్మేషన్ లింక్ ఒకటి ఉంటుందని, ఆ లింక్ పై క్లిక్ చేసినవెంటనే అప్ గ్రేడ్ ప్రాసెస్ పూర్తవుతుందని వారు చెబుతారు.

Beware Of Otp Scam-

ఆ మాటలను నమ్మి ఎస్ఎంఎస్‌ను ఓపెన్ లోపలి కన్ఫర్మేషన్ ముసుగులో ఉన్న మాల్వేర్ లింక్ పై క్లిక్ చేసిన వెంటనే యూజర్ ఫోన్ లో తనకు తెలియకుండానే మాల్వేర్‌ ఇన్‌స్టాల్ అయి పోతుంది. ఆ తరువాత నుంచి యూజర్ ఫోన్‌కు వచ్చే ప్రతి మెసేజ్ కూడా హ్యాకర్‌కు రీడైరెక్ట్ అవుతుంది. ఈ విధమైన వ్యూహాలను అనుసరించి బ్యాంక్ ఖాతాల నుంచి యూజర్లు డబ్బు దొంగిలించేస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి తెలివిగా వ్యవహరించకపోతే కష్టబడి కూడబెట్టుకున్న సొమ్ము కాస్తా ఇలా పరులపాలు కావాల్సిందే.