తెలంగాణాలో బెట్టింగ్ రాయుళ్ల సందడి !

కాయ్ రాజా కాయ్ అంటూ … తెలంగాణాలో ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.? ఏ నియోజకవర్గం నుంచి ఏ అభ్యర్థి గెలుస్తాడు.? గెలవబోతున్న ఆ ప్రముఖ నాయకుల మెజార్టీ ఎంత .? ఇలా అనేక రకాలుగా బెట్టింగ్ లు జోరందుకున్నాయి.ముఖ్యంగా మొదటి నుంచి అందరిలోనూ.ఆసక్తి పెంచిన కూకట్ పల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని గెలుస్తుందా ? లేదా ? అనే దానిపై భారీగా పందేలు కాస్తున్నారట.ముఖ్యంగా పోలింగ్ అనంతరం విడుదలయిన ఎగ్జిట్ పోల్స్ ను కూడా పందెం రాయుళ్లు వాడేసుకుంటున్నారు.ఇక తెలంగాణాలో సంచలన నాయకుడిగా ఎదిగిన రేవంత్ రెడ్డి గెలుపు పై కూడా బెట్టింగ్ లు జోరందుకున్నాయి.

 Betting In Telangana About Telangana Polls-TeluguStop.com

ఈ బెట్టింగ్ ల నేపథ్యంలో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి.

తెలంగాణాలో తెలుగుదేశం పార్టీకి ఎనిమిది స్థానాలు కూడా రావని బెట్టింగ్‌ కాసేందుకు అనేక మంది ముందుకు వస్తు న్నారు.కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి సుహాసిని గెలుపుపై నిన్న మొన్నటి వరకూ సాగిన బెట్టింగ్‌ల జోరు కొంత తగ్గింది.కొందరు టీడీపీ నాయకుల ఇళ్లపై పోలీసులు దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేశారన్న సమాచారం వెల్లడైంది.

 Betting In Telangana About Telangana Polls-తెలంగాణాలో బెట్టింగ్ రాయుళ్ల సందడి -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో సామాజిక మాధ్యమాల్లో టీడీపీకి అనుకూలంగా ఉన్న ఒక సామాజికవర్గం వారిని కట్టడి చేశారన్న ప్రచారం కూడా జరిగింది.ఫలితంగా అక్కడ సుహాసిని ఓటమి ఖాయమన్న దాని పై పందెం కాసేందుకు అనేక మంది ముందుకు వచ్చినట్లు చెప్తున్నారు.

అయితే శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత తిరిగి సుహాసిని గెలుపునకు అనుకూలంగా బెట్టింగ్‌ కాసే వారి సంఖ్య పెరిగింది.

జాతీయ సర్వేల్లో టీఆర్ఎస్ కు పట్టం కట్టగా, లగడపాటి కూటమికి ఆధిక్యం వస్తుందని తెలిపడం తో బెట్టింగ్ రాయుళ్ళు ధీమాగా ఉంటున్నారు.ఇక రేవంత్‌రెడ్డి ఓటమిపై పందాలు కన్పించనప్పటికి ఆయనకు వచ్చే ఆధిక్యంపై మాత్రం బెట్టింగ్‌ జోరుగా నడుస్తోంది.అలాగే… టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలుపు, మెజార్టీ మీద కూడా పందేలు జోరందుకున్నాయి.దీంతో పాటు తెలంగాణాలో అధికారం చేపట్టబోయే పార్టీ విషయంలో కూడా పందేలు కాస్తున్నారు.లగడపాటి సర్వే కనుక నిజం అయ్యి కూటమి అధికారంలోకి వస్తే…కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం కుర్చీ ఎవరికి దక్కబోతోంది అనే విషయంలో కూడా బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందేలు కాస్తున్నారు.

అత్యంత పగడ్బందీగా.ఊపందుకున్న ఈ పందేలను అరికట్టేందుకు పోలీసులు కూడా భారీ స్థాయిలోనే నిఘా ఏర్పాటు చేశారు.అయినా ఈ వ్యవహారం చాపకింద నీరులా సాగిపోతూనే ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు