కాయ్ రాజా కాయ్ ! ఆఫర్లతో సిద్దమైన బెట్టింగ్ రాయుళ్లు !  

Betting In Ap Elections Results-betting,chandrababu,elections,jagan,janasena,tdp,ysrcp,బెట్టింగ్,వైసీపీ

పోలింగ్ తేదీ ముగిసిన దగ్గర నుంచి ఏపీలో బెట్టింగ్ ల జోరు ఊపందుకుంది. కోట్ల లో పందేలు జరిగాయి. ఆ తరువాత ఆ ఊపు కనిపించలేదు..

కాయ్ రాజా కాయ్ ! ఆఫర్లతో సిద్దమైన బెట్టింగ్ రాయుళ్లు !-Betting In AP Elections Results

స్పష్టంగా ఎవరికి అధికారం దక్కుతుందో తెలియకపోవడంతో బెట్టింగ్ ఊపు తగ్గడానికి కారణం అయ్యింది. ప్రస్తుతం కౌంటింగ్ తేదీ దగ్గరకు వచ్చేయడంతో పాటు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ బయటకి రావడంతో మళ్లీ బెట్టింగ్ మాఫియాకు ఊపొచ్చినట్టయ్యింది. అందుకే సరికొత్త రీతిలో బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు.

టీడీపీ గెలిస్తే లక్షకు లక్షన్నర, అలాగే జగన్ సీఎం అయితే లక్షకు రెండున్నర లక్షలు ఇస్తామంటూ భారీ ఆఫర్ లు ప్రకటిస్తున్నారు. బ్రోకర్ల ఆఫర్లకు టెంప్ట్ అవుతోన్న బెట్టింగ్ రాయుళ్లు కోట్ల రూపాయల్లో పందేలు కాసేందుకు సిద్ధం అవుతున్నారు.

బెట్టింగ్ లకు మారుపేరైన గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే 200 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ తరువాత బెట్టింగ్ రాయుళ్లు మరింత ఉత్సాహంగా పావులుకదుపుతున్నారు.

గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోట్లలో పందాలు కాస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఒక్క రోజే యాభై కోట్లు చేతులు మారినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది నాలుగు రెట్లు కు మించిపోయిందనే టాక్ నడుస్తోంది.

టీడీపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని కొందరు. టీడీపీ కన్నా వైసీపీకి ఒక్క సీటైనా ఎక్కువ వస్తుందంటూ మరికొందరు పందేలు కాస్తున్నారు.

ఈ బెట్టింగ్ లలో అభ్యర్థుల గెలుపు ఓటములు కన్నా ఏ పార్టీ అధికారం దక్కించుకుంటుంది అనే విషయం మీద బెట్టింగ్ ల జోరు కొనసాగుతోంది అయితే అభ్యర్ధుల గెలుపోటముల కంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపైనే ప్రధానంగా కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. అయితే టీడీపీ కన్నా వైసీపీ వైపే బెట్టింగ్ రాయుళ్లు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

తాజాగా బెట్టింగ్ బ్రోకర్ల మధ్య సాగిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. ఈ ఆడియోను పరిశీలిస్తే గోదావరి జిల్లాలకు చెందిన పందెంరాయుళ్లే ఈ బెట్టింగ్స్‌లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది.