తమలపాకుల సాగులో ఈ జాగ్రత్తలు త‌ప్ప‌నిస‌రి

తమలపాకు మొక్కలకు కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీలు గరిష్టంగా 30 డిగ్రీలు అవసరం ఉంటుంది.తమలపాకు సాగు విపరీతమైన చలి లేదా వేడికి పంట దెబ్బతింటుంది.

 Betel Leaf Cultivation Farming Tips Details, Betel Leaf Cultivation, Farming Tip-TeluguStop.com

ఈ నేపథ్యంలో విపరీతమైన చలి నుండి తమలపాకులను రక్షించుకోవడానికి నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారం నుండి తమల పాకు సాగులో వేడి వాతావ‌ర‌ణం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.చల్లని వాతావరణంలో కొద్దిపాటి నీటిపారుదల చేయాలిసిన అవసరం ఉంటుంది.

దీని కారణంగా పంట ప్రదేశమైన నేల ఉష్ణోగ్రత పెరుగుతుంది.దీని ద్యారా తమలపాకులు చెడిపోకుండా కాపాడుకోవచ్చు.

ఈ త‌మ‌ల పాకుల‌ను సాగు చేసేముందు నేల‌ను దున్నడం ద్వారా మట్టి మెత్తగా అవుతుంది.ఆ తర్వాతే తీగ‌ల‌ను ఏర్పాటు చేయాలి.తమలపాకు సాగు కోసం సున్నంతో సరళ రేఖలు గీసి ఈ లైన్లపై మూడు నుంచి నాలుగు మీటర్ల వెదురు గడలను ఒక మీటరు వ్యవధిలో పాతిపెట్టాలి.దానికి పందిరి అల్లాలి.

తద్వారా త‌మ‌ల‌పాకు మొక్క‌ల‌కు ర‌క్ష‌ణ దొరుకుతుంది.ఇది త‌మ‌ల‌పాకు తీగ‌లు ఎదిగేందుకు స‌హ‌క‌రిస్తుంది.

అలాగే తుపానులో ఈ మొక్క‌ల‌కు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు వెదురు గడకు.వెదురు గడకు దూరం 50 సెం.మీ ఉండేలా చూసుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube