ఈ స్మూతీని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు..తెలుసా?

ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలిలో చోటుచేసుకున్న మార్పులు, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, ఒకే చోట గంట‌లు త‌ర‌బ‌డి కూర్చోవ‌డం, హార్మోన్ ఛేంజ‌స్ వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఇటీవ‌ల రోజుల్లో చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నారు.కార‌ణం ఏదైనా కొంద‌రు బ‌రువు త‌గ్గాల‌నే అతి ఉత్సాహంతో ఫుడ్‌ను తీసుకోవ‌డం మానేస్తుంటారు.

 Best Weight Loss Smoothie For Breakfast! Weight Loss Smoothie, Breakfast, Smooth-TeluguStop.com

ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్‌, డిన్న‌ర్‌ను స్కిప్‌ చేస్తుంటారు.అయితే డిన్న‌ర్ చేసినా చేయ‌క పోయినా బ్రేక్‌ఫాస్ట్ మాత్రం త‌ప్ప‌కుండా చేయాలి.

బ్రేక్‌ఫాస్ట్ చేయ‌డం వ‌ల్ల బ‌రువు పెర‌గ‌డం కాదు త‌గ్గుతారు.అందులోనూ ఇప్పుడు చెప్ప‌బోయే స్మూతీని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే సూప‌ర్ ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవ్వొచ్చు.మ‌రి లేట్ చేయ‌కుండా ఆ స్మూతీ ఏంటో.? దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో.? ఓ లుక్కేసేయండి.ముందుగా ఒక యాపిల్ తీసుకుని వాట‌ర్‌లో క‌డిగి చిన్న చిన్న‌ ముక్కలుగా క‌ట్ చేసి ప‌క్క‌న పెట్టుకోవాలి.

ఇప్పుడు బ్లెండ‌ర్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల రోల్డ్ ఓట్స్‌, రెండు పొట్టు తొల‌గించిన బాదం ప‌ప్పులు, రెండు వాల్ న‌ట్స్ వేసి పొడి చేసుకోవాలి.

ఆ త‌ర్వాత అందులో క‌ట్ చేసి పెట్టుకున్న ఒక యాపిల్, రెండు టేబుల్ స్పూన్ల తేనె, ఒక క‌ప్పు వాట‌ర్ పోసి మ‌ళ్లీ బ్లెండ్ చేసుకుంటే స్మూతీ సిద్ధ‌మైన‌ట్టే.

ఈ టేస్టీ అండ్ హెల్తీ స్మూతీని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే శ‌రీరంలో కొవ్వు క‌రుగుతుంది.అదే స‌మ‌యంలో అతి ఆక‌లి త‌గ్గి చిరు తిండ్ల‌పై మ‌న‌సు మ‌ల్ల‌కుండా ఉంటుంది.

ఫ‌లితంగా బ‌రువు త‌గ్గుతారు.

అంతే కాదు, ఈ స్మూతీని తీసుకుంటే రోజంతా యాక్టివ్‌గా, ఎన‌ర్జిటిక్‌గా మార‌తారు.నీర‌సం, అల‌స‌ట ద‌రి చేర‌కుండా ఉంటారు.శ‌రీరానికి ప్రోటీన్, ఫైబ‌ర్ వంటి పోష‌కాలు పుష్కలంగా ల‌భిస్తాయి.

మ‌రియు జీర్ణవ్యవస్థ కూడా బాగుంటుంది.

Best Weight Loss Smoothie For Breakfast! Weight Loss Smoothie, Breakfast, Smoothie, Latest News, Health Tips, Good Health, Health, Weight Loss Tips, - Telugu Breakfast, Tips, Latest, Smoothie

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube