బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నారా...అయితే ఇది మీ కోసమే!

ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని అధిక బరువు సమస్య చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది.బరువు తగ్గాలంటే పౌష్టికాహారం తీసుకుంటూ వ్యాయామం చేయాలి.

 Best Weight Loss Remedy-TeluguStop.com

చాలా మందికి ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలియదు.అలాగే భోజనం చేసిన తర్వాత ఎలాంటి స్నాక్స్ తీసుకోవాలో కూడా అర్ధం కాదు.

అలాంటి సమయంలో డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారికి బాగా సహాయపడతాయి.ఆ నట్స్ ఏమిటో చూద్దాం.

బాదం పప్పు
ఇవి మన శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.జీర్ణశక్తిని పెంచి విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తాయి.అంతేకాకుండా బాదంలో ఉండే ప్రోటీన్స్ కండరాలు దృడంగా ఉండేలా చేయటంలో సహాయపడుతుంది.బాదంలో ఉండే మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును కరిగిస్తాయి.

ప్రతి రోజు బాదం పప్పును తింటూ ఉంటే బరువు తగ్గవచ్చు.

వాల్ నట్స్
వీటిలో మాంగనీస్, కాపర్‌లు సమృద్ధిగా ఉండుట వలన అధిక బరువును తగ్గించటంలో సహాయపడుతుంది.

వాల్ నట్స్ లో ఉండే ఎల్లాజిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ వాపులను తగ్గించటంలో సహాయపడుతుంది.వాల్ నట్స్ లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండుట వలన బరువును కంట్రోల్ చేస్తుంది.

పల్లీలు
సాధారణంగా అందరూ పల్లీలు తింటే బరువు పెరుగుతామని భావిస్తారు.దానిలో ఎంత మాత్రం నిజం లేదు.

ప్రతి రోజు సరైన మోతాదులో పల్లీలను తింటే శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఫైబర్ అందుతుంది.దాంతో కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి ఆకలి తొందరగా వేయదు.

కాబట్టి బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారు పల్లీలను స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు.

పిస్తా పప్పు
దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలిగి ఆకలి తొందరగా వేయదు.

పిస్తాలో ఉండే పోషకాలు శరీర మెటబాలిజంను పెంచుతాయి.దీంతో కొవ్వు కరుగుతుంది.క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి.బరువు తగ్గుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube