బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నారా...అయితే ఇది మీ కోసమే!     2018-03-11   23:12:30  IST  Lakshmi P

ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని అధిక బరువు సమస్య చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. బరువు తగ్గాలంటే పౌష్టికాహారం తీసుకుంటూ వ్యాయామం చేయాలి. చాలా మందికి ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలియదు. అలాగే భోజనం చేసిన తర్వాత ఎలాంటి స్నాక్స్ తీసుకోవాలో కూడా అర్ధం కాదు. అలాంటి సమయంలో డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారికి బాగా సహాయపడతాయి. ఆ నట్స్ ఏమిటో చూద్దాం.

బాదం పప్పు
ఇవి మన శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. జీర్ణశక్తిని పెంచి విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తాయి. అంతేకాకుండా బాదంలో ఉండే ప్రోటీన్స్ కండరాలు దృడంగా ఉండేలా చేయటంలో సహాయపడుతుంది. బాదంలో ఉండే మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును కరిగిస్తాయి. ప్రతి రోజు బాదం పప్పును తింటూ ఉంటే బరువు తగ్గవచ్చు.