పారిజాత పుష్పాలు గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Best Unknown Benefits Of Parijata Plant Parijata Plant, Benefits, Parijatha Flower, Pooja , Vishnu Pooja , Red Colur Flower , Nine Colurs , Sagar Madhanam

మన హిందూ సాంప్రదాయాలు ప్రకారం ఎన్నో వృక్షాలను దైవ సమానంగా భావిస్తాము.ఇలా దైవ సమానంగా భావించే వాటిలో పారిజాత వృక్షం ఒకటి.

 Best Unknown Benefits Of Parijata Plant Parijata Plant, Benefits, Parijatha Flow-TeluguStop.com

పారిజాత వృక్షం సముద్ర గర్భం నుంచి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి.ముఖ్యంగా ఈ పారిజాత పుష్పాలతో విష్ణు దేవుడిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని భావిస్తారు.

ఎంతో పవిత్రమైన ఈ పారిజాత పుష్పాలతో మనం దేవుడికి పూజ చేయటం వల్ల ఆ దేవుడి అనుగ్రహం మనపై ఉంటుంది.పారిజాత పుష్పాలు అంటే మనకు తెలుపు రంగులో ఉన్నది మాత్రమే తెలుసు కానీ ఈ పుష్పాలు తొమ్మిది రంగులలో ఉంటాయి.

ఇందులో ఎరుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలతో శ్రీహరిని పూజించి కూడదని పండితులు చెబుతున్నారు.

సాధారణంగా మనం దేవుడికి పువ్వులతో పూజ చేసే సమయంలో కిందపడిన పుష్పాలతో పూజ చేయకూడదని చెబుతాము.

ఈక్రమంలోనే చెట్టుపై నుంచి పువ్వులను కోసి భగవంతుడికి అలంకరించి పూజిస్తాము.అయితే పారిజాత పుష్పాలను పొరపాటున ఎప్పుడూ కూడా చెట్టునుంచి కోయకూడదు.ఈ పుష్పాలు రాత్రి సమయంలో వికసించి తెల్లవారే సమయానికి నేలపై రాలుతాయి.ఈ విధంగా రాలిన పుష్పాలతో పూజ చేయాలి.

Telugu Benefits, Colurs, Parijata, Pooja, Sagar Madhanam-Telugu Bhakthi

దేవతలు రాక్షసులు అమృతం కోసం సాగర మధనం చేస్తున్న సమయంలో సముద్ర గర్భం నుంచి ఈ వృక్షం పంపించగా పారిజాత వృక్షాన్ని విష్ణుమూర్తి స్వర్గానికి తీసుకువెళ్లారు.స్వర్గం మొత్తం ఈ పుష్పాల పరిమళాలతో విరాజిల్లింది.అయితే సత్యభామ కోరికమేరకు స్వర్గం నుంచి విష్ణువు పారిజాత వృక్షాన్ని భూమిపైకి తీసుకువచ్చారని పురాణాలు చెబుతున్నాయి.అందుకే పారిజాత వృక్షాలకు ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు.అయితే పారిజాత వృక్షం కింద ఎప్పుడూ కూడా ఆవుపేడతో అలికి ఉంచాలి.ఈ విధంగా అలికిన పేడ పై పడిన పుష్పాలతో దేవుడిని పూజించాలి.

అయితే పొరపాటున కూడా ఈ పుష్పాలు ఎవరి వద్ద నుంచి తీసుకోకూడదు.ఇలా తీసుకోవడం వల్ల పుష్పాలను ఇచ్చిన వారికి మాత్రమే పుణ్యం వస్తుంది కనుక ఈ పుష్పాలను స్వయంగా మనమే సేకరించి స్వామికి పూజ చేయటం వల్ల ఆ స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube