వాషింగ్ మెషిన్ లో బట్టలు ఇలా ఉతికితే బట్టలు ఎప్పటికి కొత్తవాటిలా తళ తళ మెరుస్తాయి  

Best Tips To Wash Clothes In Washing Machine-

ఒకప్పుడు బట్టలు ఉతకటం అంటే ఒక పెద్ద పని.బకెట్ నీటిలో సర్ఫ్ వేసబట్టలను అరగంట నానబెట్టి ఆ తర్వాత బట్టలను ఒకొక్కటిగా తీసి సబ్బు పెట్టఉతికి జాడించి ఆరవేసేవాళ్ళం.ఇపుడైతే వాషింగ్ మిషన్స్ వచ్చేసాయి.బట్టలఉతకటం చాలా సులభం అయిపొయింది.బట్టలు మిషన్ లో వేసి సర్ఫ్ వేసి టైం సెటచేస్తే ఆరిన బట్టలు బయటకు వస్తాయి.

Best Tips To Wash Clothes In Washing Machine---

అయితే వాషింగ్ మెషిన్ లో బట్టలనఉతికే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే బట్టల మన్నితగ్గిపోతుంది.అందువల్ల జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి.ఇప్పుడు జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకుందాం.రెడీమేడ్‌ బట్టలను లేబుల్ పై రాసిన విధంగా ఉతికితే ఎక్కువ కాలం మన్నటమకాకుండా రంగులు కూడా వెలవవు.

బట్టలకు ఏమైనా మరకలు అంటితే మిగతా బట్టలతో కలిపి ఉతకకుండా వేరుగా ఉతకాలిఒకవేళ కలిపి ఉతికితే ఆ మరకలు మిగతా వాటికీ అంటే ప్రమాదం ఉంది.వాషింగ్ మెషీన్‌పై ఉన్న సెట్టింగ్స్‌ ప్రకారమే బట్టలను ఉతకాలి.ఏ ర‌క‌మైదుస్తుల‌కు ఎలాంటి సెట్టింగ్స్ స‌రిపోతాయో చూసుకుని వాడితే దుస్తులఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.

వాషింగ్ మిషన్ లో ప్యాంట్స్ వేసినప్పుడు తిరగేసి వేస్తె జీపులు పోయే ప్రమాదం ఉండదు.వాషింగ్ మెషీన్‌లో డిటర్జెంట్‌ను ఎక్కువ తక్కువ కాకుండా స‌రైన మోతాదులోనవేయాలి.డిటర్జెంట్‌ తక్కువ అయితే బట్టల మురికి వదలదు.ఎక్కువైతడిటర్జెంట్‌ నురుగు వదలదు.అందువల్ల డిటర్జెంట్‌ మోతాదు సరిగ్గా ఉండాలిమోతాదు సరిగ్గా ఉంటే బట్టల మన్నిక కూడా బాగుంటుంది.

డిట‌ర్జెంట్‌తోపాటు ఫ్యాబ్రిక్ సాఫ్టెన‌ర్‌ను కూడా వాడ‌డం మంచిదిఎందుకంటే ఫ్యాబ్రిక్ సాఫ్టెన‌ర్‌ బట్టల మన్నికను పెంచటమే కాకుండా పోగులరాకుండా చూస్తుంది.వాషింగ్ మెషీన్‌లో ఉన్న డ్రైయ‌ర్ ని ఉపయోగించటం కంటే స‌హ‌జ సిద్ధంగబ‌య‌ట ఆరేయ‌డమే మంచిది.

దీని వల్ల బట్టలు ఎక్కువ కాలం మ‌న్నుతాయి.