ఈ చిట్కాలతో జుట్టు రాలమన్న రాలదు!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు తమ తమ జీవితాలతో, తీరికలేని పనులతో ఉంటున్నారు.దీనివల్ల వాళ్ళు తమ ఆరోగ్యంపైన ఇతర సమస్యల పైన దృష్టి పెట్టక, పరిష్కారానికి సమయం దొరకక గడుపుతున్నారు.

 Best Tips To Control Hair Fall, Hairfall Problems, Pressure, Foods For Hair Grow-TeluguStop.com

ఇదిలా ఉండగా చాలామందికి వస్తున్న మొదటి సమస్య జుట్టు రాలడం.వయసుకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో ఈ సమస్య వస్తుంది.

దీనికి కారణం బయట ఉన్న కాలుష్యం, ఇతర రకాల సమస్యలు.ఇక అలా జుట్టు రాలే సమస్యలు తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం!

ఎప్పుడైనా సరే ఎక్కడికైనా బయటకి వెళ్లే సమయంలో మన జుట్టును కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి టోపీ లాంటివి ధరించాలి.

క్యాప్ ని ధరించడం వల్ల ఎలాంటి జుట్టు రాలే సమస్యలు ఉండవు.ఎందుకంటే బయట నుండి వచ్చే కాలుష్యం జుట్టును తగిలి బలహీనత చేస్తాయి.

చాలా మంది జుట్టు మెరవడానికి చాలా రకాల కండిషనర్లు వాడుతారు.దీని వల్లనే జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది.కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉంటే జుట్టు రాలడం ఆటో మెటిక్ గా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
ఇది చాలా మందిలో ఉండే సమస్య అదే ఒత్తిడి.

ఎవరైనా ఒత్తిడికి గురైనప్పుడు…అది కూడా జుట్టు మీద సమస్య ఏర్పడుతుంది.దీని వల్ల జుట్టు మొదలు భాగం బలహీనతగా మారుతాయి.

కావున చాలావరకు ఒత్తిడికి గురి కాకుండా ఉండడమే మంచిది.

పొగ త్రాగడం వల్ల కూడా జుట్టు రాలే అవకాశం ఉందని వైద్య నిపుణులు తెలిపారు.

పొగ తాగడం వల్ల జుట్టు కుదుల భాగం పొడిబారి, బలహీనంగా మారుతుంది.కాబట్టి జుట్టురాలే సమస్య ఉంటే పొగతాగే అలవాటు వెంటనే మానుకోవడం మంచిది.
చాలామంది తీసుకునే ఆహార పదార్థాలలో పోషకాహార లోపం వల్ల జుట్టు రాలే సమస్య ఉంటుంది.కాబట్టి పోషకాలు అందించే మాంసం, చేపలు, ప్రోటీన్ విలువలు ఉన్న కాయగూరలు తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు.

చూశారుగా ఈ చిట్కాలను పాటించి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి.ఆరోగ్య సమస్యల నుంచి బయటపడండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube