మీది సున్నిత‌మైన చ‌ర్మ‌మా? అయితే ఈ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారా?

సాధార‌ణంగా అంద‌రి చ‌ర్మ త‌త్వాలు ఒకేలా ఉండ‌వు.కొంద‌రివి ఆయిలీగా ఉంటే.

 Best Tips For Sensitive Skin-TeluguStop.com

కొంద‌రివి డ్రైగా ఉంటాయి.అలాగే కొంద‌రు క‌ఠినంగా ఉంటే.

మరికొంద‌రివి చాలా సున్నితంగా ఉంటాయి.అయితే మిగిలిన చ‌ర్మ త‌త్వాల‌తో పోలిస్తే సున్నిత‌మైన చ‌ర్మ త‌త్వం ఉన్న వారు మాత్రం చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

 Best Tips For Sensitive Skin-మీది సున్నిత‌మైన చ‌ర్మ‌మా అయితే ఈ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏ మాత్రం నిర్ల‌క్ష్యంగా ఉన్న చ‌ర్మం పొడిబారిపోవ‌డం, మొటిమ‌లు, మ‌చ్చ‌లు, దుర‌ద‌, ఎర్ర‌గా కందిపోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.మ‌రి లేటెందుకు సున్నిత‌మైన చ‌ర్మం ఉన్న వారు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో చూసేయండి.

చాలా మంది వేడి వేడి నీటితో స్నానం చేయ‌డ‌మంటే తెగ ఇష్ట‌ప‌డుతుంటారు.కానీ, సున్నిత‌మైన చ‌ర్మం ఉన్న వారు హాట్ హాట్ వాట‌ర్‌తో బాత్ చేస్తే.క్ర‌మంగా చ‌ర్మం ఆరోగ్యం దెబ్బ తింటుంది.అందుకే గోరు వెచ్చ‌ని నీటితోనే స్నానం చేయాలి.

క‌ఠినంగా ఉండే స‌బ్బుల‌ను ఎవైడ్ చేయాలి.మ‌రియు కెమిక‌ల్స్ త‌క్కువ‌గా ఉండే క్రీములు, మాయిశ్చ‌రైజ‌ర్లు, లోష‌న్లు మాత్ర‌మే చ‌ర్మానికి ఉప‌యోగించాలి.

సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారు కాఫీ, టీ, కూల్డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.ఎందుకంటే, వీటిల్లో కెఫిన్ అధికంగా ఉంటుంది.ఇది సున్నిత‌మైన చ‌ర్మాన్ని వేగంగా పొడిబారేలా చేస్తుంది.

అలాగే సున్నిత‌మైన చ‌ర్మం త‌త్వం ఉన్న వారు డైట్‌లో క్యారెట్‌, బీట్‌రూట్‌, పాల‌కూర‌, పొద్దుతిరుగుడు గింజలు, చేప‌లు, వాల్ న‌ట్స్‌, బాదం, బొప్పాయి, అవ‌కాడో వంటి ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవాలి.త‌ద్వారా వాటిలో ఉండే విట‌మిన్ ఇ, విట‌మిన్ సి, విట‌మిన్ బి, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చ‌ర్మానికి ర‌క్ష‌ణ క‌వ‌చంలా ఏర్ప‌డి.మొటిమ‌లు, మ‌చ్చ‌లు, ముడ‌త‌లు ఏర్ప‌కుండా అడ్డుక‌ట్ట వేస్తాయి.మొటిమ‌లు, మ‌చ్చ‌లు

సున్నిత‌మైన చ‌ర్మం క‌ల‌వారు వారానికి ఒక సారైన స్క్ర‌బ్బింగ్ చేసుకోవాలి.దాంతో చ‌ర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోకుండా ఉంటాయి.ఫ‌లితం చ‌ర్మం పాడ‌వ‌కుండా ఉంటుంది.మొటిమ‌లు, మ‌చ్చ‌లు

ఇక సెన్సిటివ్ స్కిన్ వాళ్ల‌కు క‌ల‌బంద, పెరుగు వంటి ఎంతో మేలు చేస్తుంది.అందు వ‌ల్ల వీటిని త‌ర‌చూ చ‌ర్మానికి అప్పై చేసుకుంటే చర్మం ఎరుపుగా మారడం, చికాకు పెట్ట‌డం వంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు.మ‌రియు చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ తేమ‌గా ఉంటుంది.

#Skin Care #Sensitive #Care Tips #Tips #Tips Sensitive

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు