ఇమ్యూనిటీ పెరగాలంటే పాటించాల్సిన పద్ధతులు ఇవే!

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి భయంకరమైన కరోనా వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మనకు ఇమ్యూనిటీ చాలా అవసరం.ఇమ్యూనిటీ పెంచుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు.

 Best Tips For Immunity Growth Save From Coronavirus  Best Tips, Immunity Growth,-TeluguStop.com

డ్రై ఫ్రూట్స్ , పాలు గుడ్లు, మాంసం వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.ఇవే కాకుండా ఇంకా కొన్ని పద్ధతులు ఉపయోగించి కూడా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు మరి ఆ పద్ధతులు ఏంటో తెలుసుకోండి.

ఇమ్యూనిటీని పెంచుకోవడం కోసం ఆహారం ద్వారా మాత్రమే కాకుండా మనం శారీరకంగా కూడా శ్రమించాల్సి వస్తుంది.రోజుకు కనీసం రెండు గంటల పాటు మన ఇంటి తోటలో పని చేయడం వల్ల మట్టిలో ఉండే బ్యాక్టీరియా ద్వారా ఇమ్యూనిటీ వస్తుంది.

అంతేకాకుండా సూర్యరశ్మి ద్వారా విటమిన్ డిని పొందవచ్చు.

ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఆహారం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి.

ఆకుకూరలు, దుంపలు వంటి వాటిని ఎక్కువగా ఉడికించ కుండా వీలైనంతవరకు పచ్చిగానే తినాలి.ఎక్కువగా ఉడికించడం వల్ల వాటిలో ఉన్న విటమిన్స్ ను మనం కోల్పోవాల్సి ఉంటుంది.

ఆకుకూరలు పచ్చివి తినలేకపోతే యాభై శాతం మాత్రం ఉడికించి తినాలి.దుంపలు వీలైనంత వరకు పచ్చిగా తినడమే మంచిది.

తద్వారా.ఇమ్యూనిటీని పెంచుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది.

వీలైనంతవరకు రోజుకు రెండుసార్లు స్నానం చేయడం ద్వారా మన శరీరం ఉత్తేజపరచడం కాకుండా మెదడు కూడా చురుకుగా పని చేస్తుంది తద్వారా ఒత్తిడికి లోనుకాకుండా ఆరోగ్యంగా ఉండగలము.

రోజుకు ఒక గంట పాటు యోగా వంటివి చేయడం ద్వారా మానసికంగా శారీరకంగా ఉల్లాసంగా ఉంటారు.

ఇలా కూడా రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube