గ్రీన్ టీ త్రాగటానికి కూడా ఒక సమయం ఉంటుందని తెలుసా..   Best Time To Drink Green Tea     2018-08-22   14:58:20  IST  Laxmi P

గ్రీన్ టీ త్రాగటం వలన మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అందరికి తెలిసిన విషయమే. అందుకే చాలా మంది గ్రీన్ టీ త్రాగుతున్నారు. గ్రీన్ టీ త్రాగటం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగటం,గుండె జబ్బుల ప్రమాదం తగ్గటం,అధిక బరువు సమస్య నుండి విముక్తి కలగటం వంటి ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది. గ్రీన్ టీ త్రాగటానికి కూడా ఒక సమయం ఉంటుంది. సమయం ఉంటుందా అని ఆశ్చర్యం కలుగుతుందా? ఇప్పుడు గ్రీన్ టీ ఏ సమయంలో త్రాగితే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

గ్రీన్ టీని ఉదయం 10 నుంచి 12 గంటల లోపు, సాయంత్రం 4 నుంచి 6 గంటల లోపు త్రాగితే శరీరంలో జీర్ణక్రియ రేటు బాగా పెరిగి కేలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. దాంతో బరువు తొందరగా తగ్గే అవకాశం ఉంది. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే గ్రీన్ టీని అసలు పరగడుపున త్రాగకూడదు. ఎందుకంటే ఆలా త్రాగటం వలన లివర్ పై హానికర ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు గ్రీన్ టీని పరగడుపున త్రాగకండి.

Best Time To Drink Green Tea-

ఇప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎప్పుడు గ్రీన్ టీ త్రాగాలి తెలుసుకుందాం. రక్తహీనత సమస్య ఉన్న వారు భోజనం చేశాక 2 గంటల తరువాత గ్రీన్ టీ తాగాలి. లేదంటే శరీరం ఐరన్‌ను గ్రహించలేక రక్తహీనత సమస్య మరింత ఎక్కువ అవుతుంది. అలాగే నిద్రలేమి సమస్య ఉన్నవారు పడుకొనే ముందు అసలు గ్రీన్ టీ త్రాగకూడదు. ఒకవేళ త్రాగితే నిద్ర పట్టదు. రోజుకి రెండు కప్పులు మించి గ్రీన్ టీ త్రాగకూడదు. ఒకవేళ గ్రీన్ టీని ఎక్కువగా త్రాగితే శరీరం ఎక్కువగా పోషకాలను గ్రహించలేదు. అందువల్ల మోతాదు మించకుండా త్రాగటమే మంచిది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.