సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాటలను మర్చిపోగాలమా.. ప్రతిఒక్కరి గుండెకు నచ్చే పాటలు?

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పేరు వింటే చాలు వెంటనే ఆయన అందించిన పాటలు మనసులో కదిలిపోతాయి.నోటి వెంట బయటకు వస్తాయి.

 Sirivennela Seetarama Sastry Best Songs, Best Lyricist Award, Chakram Movie, Fil-TeluguStop.com

అంత అద్భుతమైన పాటలను అందించిన సీతారామశాస్త్రి గారు ఈరోజు ఈ లోకం నుంచి మనందరికీ దూరంగా వెళ్లిపోయారు.ఎన్నో ఏళ్ల కిందట ఆయన పేపర్ పై పెట్టిన కలం.అలా ఎన్నో ఏళ్లుగా ఆయన చేతులతో రాయగా.ఆ కలంకు ఈరోజు పూర్తి విశ్రాంతి దొరికింది.

ఆయన లేరు అంటే ఇకపై తన కలంతో రాసే పాటలు కూడా లేనట్లే.

మూడు దశాబ్దాలుగా ప్రతి ఒక్కరి గుండెకు నచ్చిన పాటలను అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.

ఈయన విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో 1955 మే 20న జన్మించారు.ఇక తెలుగు సినీ పరిశ్రమకు అడుగుపెట్టాక హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు.

ఈయన కేవలం గేయరచయిత గానే కాకుండా కవిగా, గాయకుడుగా, నటుడుగా కూడా బాధ్యతలు చేపట్టి పేరు సంపాదించుకున్నారు.

Telugu Lyricist Award, Chakram, Awards, Gamyam, Kanche, Music, Nandi Awards, Sir

ఈయన తొలిసారిగా 1986లో గేయ రచయితగా తెలుగు చిత్ర పరిశ్రమకు అడుగుపెట్టారు.కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సిరివెన్నెల సినిమాతో తన పాటలను అందించారు.ఈ సినిమాలో అన్ని పాటలను తానే అందించారు.ఆయన తొలిసారిగా అందించిన పాట ‘విధాత తలపున ప్రభవించినది’.ఈ పాట ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల హృదయాలను తాకింది.ఇలా వరుసగా ఎన్నో సినిమాలలో తన పాటలను అందించారు.

1986 లో మొదలుపెట్టిన తన ప్రయాణాన్ని ఈరోజు వరకు కొనసాగించారు.ఈయన పాటలను మాత్రం మర్చిపోవడం అసాధ్యం.

ఎందుకంటే ఈయన అందించిన పాటలు ప్రతి ఒక్కరిని కదిలించాయి.ఈయన అందించిన ప్రతి ఒక్క పాట అద్భుతమైన ఆణిముత్యం.

ఈయన తన పాటలకు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.ఇక ఈయన పాడిన కొన్ని ప్రేమ పాటలు మాత్రం ప్రేమికుల హృదయాలను తాకేలా ఉంటాయి.

Telugu Lyricist Award, Chakram, Awards, Gamyam, Kanche, Music, Nandi Awards, Sir

ఇదిలా ఉంటే ఈయన రాసిన పాటలు అన్నీ అద్భుతమే.అందులో మహా అద్భుతమైన పాటలు ఏంటంటే.‘అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా’ అనే ఈ పాట మాత్రం ప్రతి ఒక్కరి గుండెల్ని కదిలిస్తుంది.ఈ పాటతో ఈయన ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

మళ్లీ మళ్లీ వినాలనిపించే ఈ పాట అందరి మదిలో నిలిచిపోయింది.

Telugu Lyricist Award, Chakram, Awards, Gamyam, Kanche, Music, Nandi Awards, Sir

ఆ తర్వాత నువ్వే కావాలి సినిమాలో ‘కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు’, ‘అనగనగా ఆకాశం ఉంది’ అనే పాటలకు మాత్రం ప్రేమికులు, యువకులు ఎంతగా ఫిదా అయ్యారో ప్రత్యేకంగా చెప్పలేం.ఇక మనసంతా నువ్వే సినిమాలో ‘తూనీగ తూనీగ’ పాటకు మాత్రం చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఆలపించారనే చెప్పాలి.అలా ఎన్నో మరెన్నో అద్భుతమైన పాటలను అందించిన సిరివెన్నెల.

ఈరోజు తన పాటలకు సెలవు తీసుకున్నారు.ఈయన ఈరోజు తన అనారోగ్య సమస్య వల్ల బాధపడుతూ సికింద్రాబాద్ కిమ్స్ హాస్పటల్ లో మరణించారు.

ఈయన మరణవార్త విన్న ఎంతోమంది అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube