Best Smartphones Under 25k : రూ.25 వేల బడ్జెట్ లో మైమరిపించే ఫీచర్లు ఉండే స్మార్ట్ ఫోన్లు ఇవే..!

భారత మార్కెట్లో ఫిబ్రవరి నెలలో రూ.25 వేల బడ్జెట్లో లభించే అద్భుతమైన ఫీచర్లు ఉండే స్మార్ట్ ఫోన్లు ఏవో చూద్దాం.

పోకో ఎక్స్ 6 5జీ స్మార్ట్ ఫోన్:

ఈ ఫోన్( Poco X6 5G ) అద్భుతమైన డిజైన్ తో 12-బిట్ కలర్ ఆప్షన్లతో ఉంటుంది. 120 Hz అమోల్డ్ డిస్ ప్లే, సూపర్ స్లిమ్ బెజెల్స్ తో ఉంటుంది.5000mAh బ్యాటరీ సామర్థ్యంతో 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పనిచేస్తుంది.రెడ్మీ నోట్ 13ప్రో మాదిరిగానే మంచి ఎక్స్పీరియన్స్ అందిస్తుంది.

స్నాప్ డ్రాగన్ సిక్స్ జనరేషన్ 1 SoC ద్వారా పనిచేస్తుంది.రూ.25 వేల బడ్జెట్ లో కొనుగోలు చేయవచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 40నియో 5జీ:

ఈ స్మార్ట్ ఫోన్( c) 144 Hz పోలెడ్ డిస్ ప్లే తో ఉంటుంది.ఈ ఫోన్ ఒక మిడ్-రేంజర్ మృదువైన స్క్రోలింగ్, గేమింగ్ ను కలిగి ఉంటుంది.5000 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి, 68w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.వేగన్ లెదర్ బ్యాక్ తో స్టైల్ గా ఉంటుంది.బ్లోట్ వేర్ లేని ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తుంది.

వన్ ప్లస్ నార్డ్ CE 3 5జీ:

ఈ ఫోన్( OnePlus Nord CE 3 5G ) 120Hz అమోల్డ్ డిస్ ప్లే తో ఉంటుంది.స్నాప్ డ్రాగన్ 782G ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది.సొగసైన డిజైన్ మిడ్ రేంజ్ ధర ట్యాగ్ ను అందిస్తుంది.5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండి, 80w ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.50ఎంపీ ట్రిపుల్ కెమెరా కలిగి ఉంటుంది.

Advertisement

iQoo నియో 7 5జీ:

ఈ ఫోన్( iQOO Neo 7 5G ) 120Hz అమోల్డ్ డిస్ ప్లే తో ఉంటుంది.64 ఎంపీ ట్రిపుల్ కెమెరా సిస్టంతో వస్తుంది.5000mAh బ్యాటరీ సామర్థ్యంతో 120w ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.సరసమైన మిడ్ రేంజ్ ఫోన్ గా ఉంది.ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది.8GB RAM+ 128GB storage, 12GB RAM+256GB స్టోరేజ్ రెండు రకాల ఆప్షన్లో లభిస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్లు రూ.25 వేల బడ్జెట్ లో అందుబాటులో ఉన్నాయి.

వైరల్ వీడియో : పాఠాలు వింటూనే గుండెపోటుకు గురైన చిన్నారి.. చివరకి?
Advertisement

తాజా వార్తలు