అతి తక్కువ ధరకే.. అద్భుతమైన ఫోన్!

ఈ మధ్యకాలంలో అతి తక్కువ ధరకే అద్భుతమైన స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి.ఆ స్మార్ట్ ఫోన్లు చూస్తే వావ్ అనకుండా ఉండలేరు.

 Best Smartphone In Lowest Cost-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.ఆ స్మార్ట్ ఫోన్ పేరు ఇన్ ఫీనిక్స్ ఎస్5 ప్రో స్మార్ట్ ఫోన్.

మన దేశంలో అతి తక్కువ ధరకే పాపప్ సెల్ఫీ కెమెరా స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.

ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం, వెనకవైపు మూడు కెమెరాల సెటప్, ఆకట్టుకునే డిజైన్ వంటివి ఈ ఫోన్ లుక్ ను అద్భుతంగా మార్చాయి.

అంతేకాదు ఈ స్మార్ట్ ఫోన్ వెనుకపై 3డీ గ్లాస్ ఫినిష్ కూడా అందుబాటులో ఉంది.అన్నిటికంటే అద్భుతమైన ఫీచర్ ఏంటి అంటే ఈ ఫోన్ కు 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

దీని ద్వారా ఈ ఫోన్ కు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా 14 గంటలు పని చేస్తుంది.

ఇంకా ఈ ఫోన్ లో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు అదిరిపోయాయి.

4000 ఎంఏహెచ్ బ్యాటరీ

6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే,

యాస్పెక్ట్ రేషియో 19.5:9,

స్క్రీన్ టు బాడీ రేషియో 91 శాతం,

మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎక్స్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టం

ఇన్ని స్పెసిఫికేషన్లు ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ధర ఎంతంటే ? 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది.ఎంత అంటే కేవలం రూ.9,999గా ఉంది.ఈ స్మార్ట్ ఫోన్ మార్చి 13వ తేదీ నుండి ఫ్లిప్ కార్ట్ లో సేల్ ప్రారంభం కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube