ఇలా చేస్తే వారం రోజుల్లో ముఖంపై నల్లని మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా తెల్లగా మారుతుంది     2018-01-31   21:12:50  IST  Lakshmi P

ముఖంపై నల్లని మచ్చలు తొలగిపోయి అందంగా,కాంతివంతంగా,తెల్లగా ఉండాలంటే ఏమి చేయాలో ఈ రోజు తెలుసుకుందాం. మన ముఖం ఎంత తెల్లగా ఉన్నా సరే మొటిమల కారణంగా వచ్చే నల్లని మచ్చలతో కాస్త ఇబ్బందిగా ఉండటం సహజమే. ఈ నల్లని మచ్చలు ముఖ సౌందర్యాన్ని తగ్గిస్తాయి. ఇప్పుడు చెప్పే చిట్కా ముఖంపై నలుపు,నల్లని మచ్చలను తొలగించటంలో బాగా సహాయపడుతుంది. మచ్చలు లేని అందమైన ముఖం మీ సొంతం కావాలంటే ఈ చిట్కాను ఫాలో అవ్వాలి.

ఈ చిట్కాకి వాజిలిన్,బేబీ ఆయిల్- పిల్లలకు మసాజ్ చేయటానికి ఉపయోగించే బేబీ ఆయిల్,కర్పూరం- మంచి నాణ్యమైన కర్పూరాన్ని మాత్రమే వాడాలి. ఇవి చర్మానికి ఎలా సహాయపడతాయో తెలుసుకుందాం. వాజిలిన్ దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్ చేస్తుంది. అంతేకాక చర్మం మీద మచ్చలను, పగుళ్ళను సమర్ధవంతంగా తగ్గిస్తుంది.

బేబీ ఆయిల్ లో విటమిన్ ఈ ఎక్కువగా ఉండుట వలన చర్మాన్ని తేమగా ఉంచి తెల్లగా మృదువుగా అయ్యేలా చేస్తుంది. కర్పూరం చర్మానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇది చర్మం మీద నల్లని మచ్చలు,కాలిన గాయాలు,దురద, ఇన్ ఫెక్షన్స్ ని తొలగిస్తుంది. ఇలా చర్మ సమస్యలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా,అందంగా మార్చటంలో సహాయపడుతుంది.

ఈ ప్యాక్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం. మొదట కర్పూరాన్ని పొడిగా చేసుకోవాలి. కర్పూరం పొడిలో పావు స్పూన్ వాజిలిన్, ఒక స్పూన్ బేబీ ఆయిల్ ని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఆయిల్ వలే కన్పించేవరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద నల్లని మచ్చలు,ఇన్ ఫెక్షన్స్ ,దురద ఉన్న ప్రాంతాలలో కాటన్ బాల్ సాయంతో రాయాలి. అరగంట తర్వాత బేబీ సోప్ తో ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ఈ విధంగా రోజులో రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖంపై నల్లని మచ్చలు మరియు ఇతర చర్మ సమస్యలను తొలగించి చర్మం అందంగా,కాంతివంతంగా, తెల్లగా మారుస్తుంది. ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి నల్లని మచ్చలు లేని అందమైన ముఖాన్ని సొంతం చేసుకోండి.