పూజ గదిలో పెద్ద సైజు రాతి విగ్రహాలను, లోహపు విగ్రహాలను పెట్టవచ్చా..? పెట్టకూడద..?

Best Size Of Idols In Pooja Room

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ గదిని ఎంతో అందంగా నిర్మించుకొని పూజలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం.వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో పూజ చేయడం కోసం ఉపయోగించే పూజ గదిలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా సిమెంటు మెట్లు పెట్టకూడదు.

 Best Size Of Idols In Pooja Room-TeluguStop.com

చెక్కతో చేయించిన పలకలమీద మన ఇష్టదైవమైన ఫోటోలను ఉంచుకొని పూజలు చేయ వచ్చు.కానీ ప్రస్తుత కాలంలో పూజ కోసం కూడా ప్రత్యేకంగా ఒక గదిని నిర్మించుకొని ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నారు.

ఈ విధంగా మన ఇంట్లో పెద్ద పూజగది ఉన్నప్పుడు ఆ ఇంట్లో పెద్ద విగ్రహాలను పెట్టి పూజ చేయడం మనం చూస్తూనే ఉంటాం.అయితే ఈ విధంగా ఇంట్లో పెద్ద సైజులో ఉన్నటువంటి రాతి విగ్రహాలను లేదా లోహపు విగ్రహాలను ఉంచి పూజ చేయవచ్చా అనే సందేహం చాలామందికి కలుగుతుంది.

 Best Size Of Idols In Pooja Room-పూజ గదిలో పెద్ద సైజు రాతి విగ్రహాలను, లోహపు విగ్రహాలను పెట్టవచ్చా.. పెట్టకూడద..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మన ఇంట్లో పూజ గదిలో పూజ చేయటం కోసం పెద్ద సైజులో ఉన్నటువంటి రాతి విగ్రహాలను లేదా లోహపు విగ్రహాలను ఉపయోగించకపోవడం ఎంతో మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.ఒకవేళ అలాంటి విగ్రహాలు మన ఇంటిలో ఉన్నప్పుడు వాటికి ఎంతో నిష్టగా పూజలు చేయాలి.

ఆ విధంగా చేయలేని వారు వెంటనే పూజ గదిలో ఉన్నటువంటి ఈ పెద్ద విగ్రహాలను తొలగించడం ఎంతో ఉత్తమమని పండితులు తెలియజేస్తున్నారు.

Telugu Architecture, Big Idols, Statues, Energy, Pooja, Stone Statues, Telugu Bhakti, Vastu Sastram-Telugu Bhakthi

ఈ విధంగా పెద్ద సైజులో ఉన్నటువంటి విగ్రహాలను మన ఇంట్లో ఉంచుకొని సరైన క్రమంలో పూజ చేయకపోవడం వల్ల ఆ విగ్రహాల వల్ల మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది.దీనిద్వారా ఇంట్లో కలహాలు, ఆందోళనలు, ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యలు తలెత్తుతాయి.ఈ విధమైనటువంటి విగ్రహాలు ఇంట్లో ఉండి సరైన క్రమంలో పూజలు చేయకపోతే అవి ఇంటికి ఎంతో హానికరం తెలియజేస్తాయి.

కనుక ఇటువంటి విగ్రహాలు వీలైనంత వరకు ఇంట్లో లేకుండా చూసుకోవడం ఎంతో ఉత్తమం.అదేవిధంగా స్వామివారికి పూజ చేసే సమయంలో ఎల్లప్పుడూ కూడా తూర్పు వైపుకు మళ్లీ దీపారాధన చేసి ఆ భగవంతున్ని ప్రార్థించాలి.

అదే విధంగా దీపారాధన చేసిన తర్వాత దీపాలు ఎల్లప్పుడూ కూడా తూర్పు వైపుకు మళ్లించి ఉండాలని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.

#Stone Statues #Pooja #Energy #Big Idols #Bhakti

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube