ఈ ఆహారాల‌ను వండ‌కుండా తీసుకున్నా ఆరోగ్య‌మే.. తెలుసా?

ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం తీసుకోవ‌డం ఎంత ముఖ్య‌మో.ఆ ఆహారంలో మ‌న శ‌రీరానికి కావాల్సిన పోష‌కాలు పుష్క‌లంగా ఉండేలా చూసుకోవ‌డం కూడా అంతే ముఖ్యం.

అందుకే ఆరోగ్యంపై శ్ర‌ద్ధ ఉన్న వారు విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్ పుష్క‌లంగా ఉండే ఆహారాల‌ను తెచ్చి వండుకుని తింటుంటారు.అయితే కొన్ని కొన్ని ఆహారాల‌ను వండ‌కుండా తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.బీట్‌రూట్‌.

హెల్త్‌కి ఎంత మేలు చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.అయితే వండిన బీట్‌రూట్ కంటే ప‌చ్చి బీట్‌రూట్ తీసుకోవ‌డం ద్వారానే ఎక్కువ పోష‌కాలు మ‌రియు ఎక్కువ లాభాలు పొందొచ్చ‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

ప‌చ్చి బీట్‌రూట్‌ను త‌ర‌చూ తీసుకుంటే ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది.ర‌క్త‌హీన‌త ద‌రి చేర‌దు.

కాలేయ స‌మ‌స్య‌లకు దూరంగా ఉండొచ్చు.శ‌రీరం ఎల్ల‌ప్పుడూ ఫుల్ యాక్టివ్‌గా, ఎన‌ర్జిటిక్‌గా వ‌ర్క్ చేస్తుంది.

ఉల్లిపాయను కూడా వండ‌కుండా తీసుకోవ‌చ్చు.ప‌చ్చి ఉల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది.

ఏకాగ్రత పెరుగుతుంది.బ్యాడ్ కొలెస్ట్రాల్ క‌రుగుతుంది.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ త‌గ్గు ముఖం ప‌డుతుంది.జీర్ణ వ్యవస్థ చురుగ్గా ప‌ని చేస్తుంది.

Advertisement

మ‌రియు మూత్రశయ ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.

అలాగే పాలకూరను వండ‌కుండా తీసుకున్నా ఆరోగ్య‌మే.ముఖ్యంగా పాల‌కూర‌తో జ్యూస్‌ను త‌యారు చేసుకుని త‌ర‌చూ తాగితే కంటి చూపును మెరుగ్గా మారుతుంది.కండరాలు బ‌లోపేతం అవుతాయి.

ఎముక‌ల బ‌ల‌హీన‌త త‌గ్గుతుంది.వెయిట్ లాస్ కూడా అవుతారు.

ఇక వీటితో పాటు కొబ్బ‌రి, క్యారెట్‌, న‌ట్స్‌, వెలుల్లి, పుదీనా, అల్లం, కీర వంటి వాటిని వండ‌కుండా తీసుకుంటేనే ఆరోగ్యానికి ఎక్కువ ప్ర‌యోజ‌నాలు చేకూర‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు.కాబ‌ట్టి, వీటిని వీలైనంత వ‌ర‌కు కుక్ చేయ‌కుండా తినేందుకే ప్ర‌య‌త్నించండి.

తాజా వార్తలు