యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లో ఉన్న గొప్ప లక్షణాలివే.. అవేంటంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయని ఆయన అభిమానులు, సన్నిహితులు చెబుతున్నారు.

 Best Qualities In Young Tiger Junior Ntr Cine Career, Junior Ntr, Ntr Career, Ntr, Ntr Birthday, Junior Ntr Birthday, Ntr Look-TeluguStop.com

వరుసగా ఆరు విజయాలతో డబుల్ హ్యాట్రిక్ ను సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే టాలీవుడ్ హీరోలలో ఒకరని చెప్పవచ్చు.
ఫ్లాప్ వచ్చినా డైరెక్టర్లను నిందించకుండా కథ నచ్చితే ఆ డైరెక్టర్లకు మరో ఛాన్స్ ఇచ్చే హీరోగా కూడా జూనియర్ ఎన్టీఆర్ కు పేరుంది.

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తను ఎంత పెద్ద హీరో అయినా స్క్రిప్ట్ ను లాక్ చేసిన తర్వాత స్క్రిప్ట్ లో వేలు పెట్టడానికి అస్సలు ఇష్టపడరు.సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అయిన జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు అడిగితే సీన్ పర్ఫెక్ట్ గా వచ్చేవరకు సీన్ విషయంలో అస్సలు రాజీ పడరు.

 Best Qualities In Young Tiger Junior NTR Cine Career, Junior NTR, NTR Career, NTR, NTR Birthday, Junior NTR Birthday, NTR Look-యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లో ఉన్న గొప్ప లక్షణాలివే.. అవేంటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమాసినిమాకు లుక్ ను మార్చుకునే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రతి ప్రాజెక్ట్ కు తన బెస్ట్ ఇవ్వడానికి ఎంతగానో కృషి చేస్తారని ఇండస్ట్రీలో పేరుంది.తాజాగా ఒక మీడియా కన్సల్టింగ్ సంస్థ ఏప్రిల్ నెలలో సర్వేను నిర్వహించగా టాలీవుడ్ నుంచి తారక్ నంబర్ 1 స్థానంలో నిలిచారు.తారక్ తన ప్రతిభ వల్లే ఈ రికార్డ్ ను సాధించారు.డైలాగ్ డెలివరీతో పాటు నటన, డ్యాన్స్, మరికొన్ని అద్భుమైన నైపుణ్యాలు ఉన్న స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కావడం గమనార్హం.

ట్విట్టర్ లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో తారక్ ఒకరు.అభిమానులకు ప్రాధాన్యత ఇచ్చే ఎన్టీఆర్ అభిమానులకు ఏదైనా కష్టం వచ్చిందని తెలిస్తే ఆదుకునే విషయంలో ముందువరసలో ఉంటారు.

ఇతర హీరోల ఫ్యాన్స్ తో గొడవలు వద్దని అలాంటి వాటిని తాను ప్రోత్సహించనని చెప్పిన స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కావడం గమనార్హం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube