వంట చేయాలంటే ఖచ్చితంగా నూనె అవసరం ఉంటుంది.ఆ నూనె ఎంపిక కరెక్ట్‌గా ఉంటేనే.
ఆరోగ్యానికి మంచిది.ప్రస్తుతం మనకు మార్కెట్లో అనేక రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి.
వాటిలో ఏదో ఒక బెస్ట్ నూనెను ఎంచుకుని వంటలకు వాడుతుంటారు.ముఖ్యంగా భారతీయ వంటల్లో వేరుశనగ నూనె, సన్ ఫ్లవర్ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె వంటివి ఎక్కువగా వాడుతుంటారు.
అయితే కొందరు డీప్ ఫ్రై వంటలకు ఏవేవో నూనెలు వాడుతుంటారు.కానీ, వాస్తవానికి డీప్ ఫ్రై వంటలకు మరియు ఫ్రై కర్రీలకు ఏ నూనె పడితే ఆ నూనె అస్సలు వాడకూడదు.
మరి అలాంటి వంటలకు ఏ ఏ నూనెలు వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి నూనె వంటలకు వాడితే ఆరోగ్యానికి ఎంతో మంచిదే.అయితే డీప్ ఫ్రై వంటలకు మరియు ఫ్రై కర్రీలకు కూడా కొబ్బరి నూనె బెస్ట్ అంటున్నారు.ఎందుకంటే, కొబ్బరి నూనెలో ఉండే సాచురేటెడ్ ఫ్యాట్స్ శరీరంలో వేడి తగ్గించడంతో పాటు ఆరోగ్యాన్ని పెంచుతుంది.
అలాగే వేరుశనగ నూనెను కూడా డీప్ ఫ్రై మరియు ఫ్రై కర్రీలకు ఉపయోగించవచ్చు.వేరుశనగ నూనెలో ఉండే మోనో శాచురేటెడ్, పోలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు ఒమెగా-3 ప్యాటీ ఆసిడ్స్ అనేక రకాల జబ్బుల నుంచి రక్షిస్తుంది.పామ్ ఆయిల్‌ను కూడా ఇలాంటి వంటలకు యూజ్ చేయవచ్చు.పామ్ ఆయిల్లో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్, కెరొటిన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఇక డీప్ ఫ్రై, ఫ్రై కర్రీలకు వాడకూడని నూనెల విషయానికి వస్తే.సన్ ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, సెసమీ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటివి వాడకూడదు.
ఇలాంటివి వాడటం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది.అయితే మరో ముఖ్య విషయం ఏంటంటే.
వంటలకు వాడే ఏ నూనె అయినా మళ్లీ మళ్లీ వేడిచేసి వాడడం చాలా డేంజర్.అలా చేస్తే.
నూనెలో ఉండే పోషకాలు అన్ని పోతాయి.