పాదాలు మృదువుగా ఉండటానికి అద్భుతమైన చిట్కాలు     2018-05-11   23:24:36  IST  Lakshmi P

మన రోజువారీ పనుల కారణంగా శరీరంలో ఇతర భాగాలు కన్నా పాదాలు కాస్త పొడిగా ఉంటాయి. పాదాలు పొడిగా కాకుండా కాస్త తేమగా ఉండాలంటే తప్పనిసరిగా మాయిశ్చరైజర్ ని ఉపయోగించాలి. ఈ మాయిశ్చరైజర్ లను ఉపయోగించటం వలన పాదాల చర్మం మృదువుగా మారి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు పొడి చర్మం కోసం సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ లను ఎలా ఉపయోగించాలో తెలుస్కుందాం.

కొబ్బరినూనె కాళ్ళను,పాదాలను మృదువుగా ఉంచటానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. కొబ్బరి నూనె పాదాలకు,కాళ్లకు రాసి 5 నిముషాలు మసాజ్ చేస్తే చర్మ గ్రంధులు లోపలకు వెళ్లి మరీ దాని ప్రభావాన్ని చూపుతుంది.