కర్లీ హెయిర్(గిరిజాల జుట్టు).చూసేందుకు అందంగానే ఉంటుంది.
కానీ, దీన్ని హ్యాండిల్ చేయడం కాస్త కష్టంతో కూడుకున్న పని అనే చెప్పాలి.ఎందు కంటే కర్లీ హెయిర్ ఇట్టే చిక్కు పడిపోతుంది.
అలాగే తరచూ డ్రైగా మారిపోయి ఎండినట్టు అయిపోతుంది.అందుకే కర్లీ హెయిర్ ఉన్న వారు తప్పని సరిగా కండీషనర్స్ వాడుతుంటారు.
జుట్టు సరైన కండీషన్‌లో ఉంచడానికీ, డ్రై హెయిర్ సమస్య దరి చేరకుండా చేయడానికీ, జుట్టు విరిగిపోవడాన్ని నిరోధించడానికీ కండీషనర్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి.
ఈ నేపథ్యంలోనే ఇటీవల రోజుల్లో కండీషనర్స్ వినియోగం బాగా పెరిగింది.
ఇందుకు తగ్గట్టుగానే రకరకాల కండీషనర్స్ అందుబాటులోకి వచ్చాయి.కానీ, మార్కెట్‌లో దొరికే కండీషనర్స్‌లో ఎన్నో కెమికల్స్ నిండి ఉంటాయి.
వీటితో లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి.అందు వల్ల కర్లీ హెయిర్ ఉన్న వారు ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ కండీషన్స్ వాడితే జుట్టు మృదువుగా, తేమగా మరియు హెల్తీగా మెరిసిపోతుంది.
మరి లేటెందుకు ఆ కండీషనర్స్ ఏంటో చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో అర కప్పు కొబ్బరి పాలు, రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్, ఒక స్పూన్ నిమ్మ రసం వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమం జుట్టుకు మంచి కండీషనర్‌లా పని చేస్తుంది.ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి అర గంట అనంతరం మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి.
హెడ్ బాత్ చేసిన ప్రతి సారి ఇలా చేస్తే జుట్టు తేమగా, షైనీగా మారుతుంది.మరియు తరచూ చిక్కు పడకుండా ఉంటుంది.
అలాగే ఒక బౌల్‌లో మూడు స్పూన్ల పెరుగు, ఒక స్పూన్ ఆముదం, ఒక ఎగ్ వైట్ వేసుకుని కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఇరవై నిమిషాల పాటు షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి.
ఆపై గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.కర్లీ హెయిర్ వారు ఈ న్యాచురల్ కండీషనర్‌ను ఉపయోగించడం వల్ల జుట్టు బౌన్సీగా, ప్రకాశవంతంగా మారుతుంది.
మరియు హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్ వంటి సమస్యలూ తగ్గుతాయి.