రెహమాన్, అనిరుధ్, థమన్, దేవిశ్రీ ప్రసాద్ లలో నంబర్ వన్ అతనేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో, ఇతర ఇండస్ట్రీలలో ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు.ఈ మ్యూజిక్ డైరెక్టర్లు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లుగా కెరీర్ ను కొనసాగిస్తూ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు.

 Best Music Director Between These Music Directors Details Here Goes Viral ,rahm-TeluguStop.com

అయితే ఈ మ్యూజిక్ డైరెక్టర్లలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు సమాధానంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఒకప్పుడు టాలీవుడ్ లో దేవిశ్రీ ప్రసాద్ నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు.

అయితే మారుతున్న కాలంతో పాటే దేవిశ్రీ ప్రసాద్ మారడం లేదు.గత కొన్నేళ్లలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చిన సినిమాలలో మెజారిటీ సినిమాల మ్యూజిక్ పై విమర్శలు వచ్చాయి.

డైరెక్టర్ సుకుమార్ సినిమాలు మినహా మిగతా డైరెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో దేవిశ్రీ ప్రసాద్ ఫెయిల్ అయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి.కొంతమంది డైరెక్టర్లతో దేవిశ్రీ ప్రసాద్ కు విభేదాలు ఉండటం గమనార్హం.

మరో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ త్రివిక్రమ్ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చిన స్థాయిలో ఇతర డైరెక్టర్ల సినిమాలకు ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఏఆర్ రెహమాన్ ఒకప్పుడు వరుస విజయాలను సొంతం చేసుకున్నా గతంతో పోల్చి చూస్తే ఇప్పుడు ఆయన హవా తగ్గింది.అయితే తమిళంలో మాత్రం ప్రస్తుతం అనిరుధ్ హవా కొనసాగుతుండటం గమనార్హం.

ప్రస్తుతానికి అయితే తెలుగులో థమన్ నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా తమిళంలో అనిరుధ్ నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు.రాబోయే రోజుల్లో ఈ ఇద్దరిలో ఎవరు నంబర్ వన్ అనే ప్రశ్నకు సైతం సమాధానం దొరికే అవకాశం ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.టాలీవుడ్, కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య గట్టి పోటీ అయితే ఉంది.

బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు మాత్రం గట్టి పోటీ ఇచ్చే విషయంలో ఫెయిల్ అవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube