సమంతను టాప్ హీరోయిన్ గా మార్చిన సినిమాలు ఇవే..!

సౌత్ స్టార్ హీరోయిన్లలో సమంత రూత్ ప్రభు ఒకరు.ఈమె గత దశాబ్ద కాలంగా తెలుగు ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

 Best Movies Of Samantha Ruth Prabhu Details, Samantha, Best Movies Of Samantha,-TeluguStop.com

అయితే ఈమె ఈ స్టేజ్ కు రావడానికి చాలానే కష్టపడింది.ఎవ్వరికి వెంటనే స్టార్ డమ్ వచ్చేయదు.

ఎంతో శ్రమ ఆపై అదృష్టం కూడా ఉండాలి.అప్పుడే ఏ నటి అయినా స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది.

ఇక ఈమె కెరీర్ లో కూడా ప్లాప్ లు ఎదురయ్యాయి.

అలాంటి సమయంలో కూడా ఈమె వెనకడుగు వేయకుండా పట్టుదలతో సినిమాలు చేసి స్టార్ స్టేటస్ అందుకుంది.

అలా సమంత కెరీర్ లో ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి సహాయ పడిన సినిమాలు ఏంటో తెలుసా.ఈమె ఏమాయ చేసావే సినిమాతో 2010 లో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమా యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అవ్వడంతో ఆ తర్వాత సమంత కెరీర్ ఊపందుకుంది.

వెంటనే ఎన్టీఆర్ తో బృందావనం సినిమాలో అవకాశం వచ్చింది.ఈ సినిమా కూడా హిట్ అయ్యింది.ఆ తర్వాత వచ్చిన దూకుడు సినిమాతో ఈ బ్యూటీ స్టార్ స్టేటస్ అందు కునేందుకు కొద్దీ దూరంలో ఉంది.

మహేష్ కెరీర్ లోనే సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది దూకుడు.ఇక ఆ తర్వాత సామ్ చేసిన ఈగ కూడా ఈమెకు నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత సమంతకు వరుసగా రెండు హిట్లు వచ్చాయి.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది. ఈ రెండు కూడా స్టార్ హీరోల సినిమాలు.ఇక రెండు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

దీంతో ఈమె స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, అఆ, మనం, రంగస్థలం, మజిలీ సినిమాలు ఆమె నటనలో కొత్త కోణాలను ఆవిష్కరించాయి.ఇక ఇటీవలే వచ్చిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ అయితే ఈమెకు పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చిపెట్టింది.ఇక ఇప్పుడు కూడా ఈమె చేతిలో నాలుగైదు ప్రాజెక్ట్ లు ఉన్నాయి.

అవి కూడా హిట్ అయితే మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకోవడం ఖాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube