సంపూ సినిమాకు అవార్డ్‌

విడుదలకు ముందే సంచలనాలు సృష్టించిన సంపూర్నేష్‌బాబు ‘హృదయ కాలేయం’ సినిమాకు అవార్డు రావడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.ఈ సినిమా 2014 సంవత్సరంకు గాను టాలీవుడ్‌ నుండి ఉత్తమ సినిమాగా ఎంపిక అయ్యింది.

 Best Movie Award To Hrudaya Kaleyam Movie-TeluguStop.com

సన్‌ నెట్‌ వర్క్‌ వారు అందించిన ఈ అవార్డు సినిమాకు వచ్చిన ఏకైక అవార్డు.సంచలనాల సంపూర్నేష్‌బాబు నటించిన ‘హృదయ కాలేయం’ సినిమాను చెత్త సినిమా అన్న వారు ఉన్నారు, బెస్ట్‌ మూవీ అన్న వారు ఉన్నారు.

కామెడీ సినిమాల్లో ఇదో ట్రెండ్‌ సెట్టర్‌ మూవీ అని కూడా కొందరు అన్నారు.అంతటి టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమాకు అవార్డు రావడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా సన్‌ నెట్వర్క్‌ ఇచ్చి ఈ అవార్డుల్లో ‘హృదయ కాలేయం’ సినిమాతో పాటు ‘రన్‌ రాజా రన్‌’, ‘గీతాంజలి’, ‘జంప్‌ జిలాని’ చిత్రాలు నామినీలుగా ఉన్నాయి.అయితే ఆ మూడు సినిమాలను కూడా పక్కన పెట్టి ఎక్కువ మంది ప్రేక్షకులు ‘హృదయ కాలేయం’ సినిమాకు ఓటు వేశారు.

ప్రేక్షకులు ఏ రీతిలో ఆలోచించిన ‘హృదయ కాలేయం’ సినిమాకు ఓటు వేశారో తెలియదు మొత్తానికి ఒక చెత్త(?) సినిమాకు అవార్డు రావడం చర్చనీయాంశం అయ్యింది.ఈ సినిమాకు స్టివెన్‌ శంకర్‌ దర్శకత్వం వహించగా, సంపూకు జోడీగా కావ్య కుమార్‌ మరియు ఇషికలు హీరోయిన్‌లుగా నటించారు.

ఇక ప్రస్తుతం సంపూ ‘కొబ్బరి మట్ట’ మరియు ‘సింగం 123’ సినిమాల్లో నటిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube