నేటి పొదుపు రేపటికి మదుపు అంటే ఇదే... ఎన్నో ప్రయోజనాలు చూడండి!

నేటి దైనందిత జీవితంలో పొదుపు చేయడం అనేది చాలా కీలకం అని చెప్పుకోవాలి.మన భారతదేశంలో సగటు దిగువ మధ్య తరగతివారు తమ పిల్లలకోసం చిన్నప్పటినుండే ధనాన్ని దాచుకోవలసిన పరిస్థితి.

 Best Investment Plan For Child Girl Sukanya Samruddhi Yojana And Children Mutual-TeluguStop.com

ముఖ్యంగా బాలికల విషయంలో వారు చాలా శ్రద్ధ వహిస్తారు.వారి చదువు కోసం కావచ్చు, వివాహం కోసం కావచ్చు… ముందుగానే ప్రణాళికలను వేసుకొని కొంత మొత్తాన్ని దాచుకుంటారు.

ఈ క్రమంలో వారు రకరకాల స్కీములలో డబ్బులను దాచిపెట్టుకుంటారు.అయితే ఇపుడు అందుబాటులోవున్న బెస్ట్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాము.

Telugu Child, Mutual, Financial Tips, Benefits, Personal-Latest News - Telugu

ఇందులో మొదటిది SSY (సుకన్య సమృద్ధి యోజన).ఈ స్కీము కింద 0–10 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు పిల్లల పేరు మీద ఖాతాలను తెరవొచ్చు.ఖాతా తెరిచిన తేదీ నుంచి 15 సంవత్సరాల వరకు నెలవారీ లేదంటే వార్షిక ప్రాతిపదికన కూడా డిపాజిట్లు చేయవచ్చు.ప్రస్తుతం, SSY ఏడాదికి 7.6 శాతం వడ్డీ ఇస్తుంది.SSY ఖాతాను తెరవడానికి కనీస మొత్తం మొన్నటి వరకు రూ.1,000 ఉండగా ఇపుడు దానిని రూ.250కి తగ్గించారు.ఇక ఒక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్​ చేస్తే అధిక లాభం ఉంటుంది.

Telugu Child, Mutual, Financial Tips, Benefits, Personal-Latest News - Telugu

కమర్షియల్ బ్యాంక్ లేదా పోస్టాఫీసులో SSY ఖాతా తెరవడం ద్వారా తమ కుమార్తెలకు మంచి భవిష్యత్​ను ఇవ్వవచ్చు.”ఆ తరువాత చెప్పుకోదగ్గ స్కీము అంటే చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్. భారతదేశంలోని ఆడ పిల్లల కోసం అందుబాటులో వున్న మరో అద్భుతమైన ప్లాన్ ఇదని చెప్పుకోవచ్చు.

దీనికి ఐదేళ్ల వరకు లాక్ ​ఇన్​ పీరియడ్ ఉంటుందని గమనించండి.ముఖ్యంగా తన కుమార్తెలని హయ్యర్​ ఎడ్యుకేషన్​ వంటి అవసరాల కోసం ఇందులో పెట్టుబడి పెట్టి హాయిగా జీవించవచ్చు.

ఇక దీనికి వడ్డీరేటు ఏడు శాతానికి పైగా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube