ఈ మొక్కలు ఇంట్లో ఉంటే ఎంత మంచిదో తెలుసా?  

best indoor trees allover mint trees indoor trees, sage plant, mint tree, aloe vera plant - Telugu Aloe Vera Plant, Indoor Trees, Mint Tree, Sage Plant

మన ఇంటి ఆవరణంలో పచ్చని చెట్లు ఉండటం వల్ల మానసికంగా ఎంతో ప్రశాంతతను కలిగిస్తాయి.ముఖ్యంగా కొన్ని చెట్లను పెంచుకోవడం ద్వారా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అంతేకాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది.

TeluguStop.com - Best Indoor Trees Allover Mint Tree

కొన్ని మొక్కలు చర్మ సౌందర్యం కోసం ఉపయోగపడతాయి.ఇలా ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటాయి.

ఇంతకీ ఆ మొక్కలు ఏమిటి అని ఆలోచిస్తున్నారా? అయితే ఆ మొక్కల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

TeluguStop.com - ఈ మొక్కలు ఇంట్లో ఉంటే ఎంత మంచిదో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image

అలోవెరా.

కలబంద అనేది ప్రసిద్ధి చెందిన ఔషధ గుణాలున్న మొక్క.దీనిని ఎన్నో సంవత్సరాల నుంచి ఔషధంగా ఉపయోగిస్తున్నారు.

కలబందలో అధిక శాతం నీటిని కలిగి ఉంటుంది.అలోవెరా జెల్ లో వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు, అమినో యాసిడ్లు ఎంతో ఉపయోగకరమైన బయో యాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది.అంతేకాకుండా ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, గాయాలను నయం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

పుదీనా.

పుదీనా వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని మనందరికీ తెలిసినదే.ఈ ఆకులను పానీయాలు తయారీలోనూ, వంటలు తయారీలోనూ ఉపయోగిస్తారు.

పుదీనాలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఇం మొటిమలను సమర్థవంతంగా నివారించి, నూనె స్రావాన్ని నియంత్రిస్తుంది.అలాగే మన చర్మంలో ఉన్న తేమను లాక్ చేసి పొడి, దురద కలిగినటువంటి చర్మాన్ని సున్నితంగా చేస్తుంది.

సేజ్ ప్లాంట్.

సేజ్ యొక్క అనేక నిరూపితమైన ఆరోగ్య లక్షణాలను కలిగి ఉంది.అధిక యాంటీ ఆక్సిడెంట్ సామర్థ్యం కారణంగా ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీర కణాలను కాపాడుతుంది.ఇందులో విటమిన్ ఏ తో పాటు క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా తయారవుడంతో పాటు కంటి చూపుకు మెరుగ్గా ఉంటుంది.

అంతేకాకుండా రక్తంలోని గ్లూకోజ్ ఇంకా చక్కెరలను సాధారణ స్థాయిలో ఉంచుతుంది.చూశారు కదా ఇలాంటి మొక్కలను ఇంటి ఆవరణంలో పెంచుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అనేది.

మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే ఈ చెట్లను పెట్టి మంచి లాభాలను పొందండి.

#Aloe Vera Plant #Sage Plant #Indoor Trees #Mint Tree

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Best Indoor Trees Allover Mint Tree Related Telugu News,Photos/Pics,Images..