దురదను తగ్గించే అద్భుత పదార్థాలు మీకోసం   Best Home Remedies For Skin Itching     2017-02-05   21:31:42  IST  Lakshmi P

దురద చాలా భయంకరమైన సమస్య. దురదపై మన గోళ్ళు పడినాకొద్ది అది పెరిగిపోతూనే ఉంటుంది. ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్ ని తీసుకువస్తుంది. జిడ్డులాంటి సమస్య ఇది. అంత త్వరగా పోదు. కారణాలు అనేకం. రక్తంలో ఇన్ఫెక్షన్ వలన కూడా కావచ్చు. డాక్టర్ ని ఎలాగో సంప్రదించాలి. కాని మీవంతు ప్రయత్నంగా ఇంట్లో ఇవి వాడండి.

* తులసి ఆకులలో థైమాల్, కామ్ఫార్, యుజేనాల్ అనే పదార్థాలు ఉండటం వలన ఇది దురదని తగ్గిస్తుంది. తాజాగా ఉండే తులసి ఆకులని దురదగా ఉన్న ప్రదేశంలో రాసుకున్న ఫర్వాలేదు లేదంటే మరుగుతున్న నీటిలో తులసి ఆకులు వేసి, కొంచెం చల్లబడ్డాక కాటన్ తో దురద ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకున్న ఫర్వాలేదు.

* కొబ్బరినూనె కూడా దురదపై బాగా పనిచేస్తుంది. ఏమి కలపకుండా డైరెక్టుగా కొబ్బరినూనె దురద ఉన్న చోట కాటన్ తో రాయండి.

* హానికరమైన కెమికల్స్ లేని పెట్రోలియం జెల్లి కూడా దురదపై అద్భుతంగా పనిచేస్తుంది.

* డాక్టర్లు మెచ్చే ఆపిల్ సైడర్ వెనిగర్ యాంటి సెప్టిక్, యాంటి ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. రోజు కాటన్ తో వెనిగర్ ని తీసుకొని దురదపై రాస్తూ ఉండండి. మార్పు కనిపిస్తుంది.

* మంటగా ఉన్న, ఓర్చుకొని నిమ్మరసం ఉపయోగిచాల్సిందే. విటమిన్ సి ఉండటం వలన ఇది మీ దురదను తగ్గిస్తుంది. కాటన్ ఉపయోగించండి. చేతులు వద్దు.

* కలబంద చాలా అంటే చాలా ఎఫెక్టివ్ గా చర్మంపై ఉన్న దురదపై దాడి చేస్తుంది. అలోవేరా జెల్లి మీదకి మార్కెట్ లో దొరికే ఏ క్రీమ్ రాదు.

* ఇక చివరగా చెబుతున్న అతి ముఖ్యమైన విషయం .. దురదపై మీ చేతులు, గోళ్ళు పడితే అది ఇంకా ఎక్కువే అవుతుంది. తాకడం, గోకడం మానేస్తే అదే తగ్గుతుంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.