వైరల్ ఫీవ‌ర్‌ ని తగ్గించే అద్భుతమైన ఇంటి చిట్కాలు

సీజన్ మారేటప్పటికీ వైరల్ ఫీవ‌ర్‌ లు వచ్చేస్తూ ఉంటాయి.వాతావరణంలో సడన్ గా మార్పులు రావటం,దోమలు కుట్టటం, ఉష్ణోగ్రతలో వచ్చే మార్పులు వంటి కారణాలతో వైరల్ జ్వరాలు వస్తూ ఉంటాయి.వైరల్ జ్వరాలు తగ్గటానికి డాక్టర్ ఇచ్చిన మందులతో పాటుగా ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాలను కూడా పాటిస్తే తొందరగా తగ్గటమే కాకుండా జ్వరం కారణంగా వచ్చే నీరసం కూడా కంట్రోల్ లోకి వస్తుంది.

 Best Home Remedies For Curing Viral Fever Details, Best Home Remedies ,curing Vi-TeluguStop.com

ధనియాల టీ

ధనియాలలో యాంటీ బయోటిక్ గుణాలు ఉండుట వలన జ్వరం తగ్గించటానికి సహాయపడుతుంది.ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ ధనియాలు వేసి బాగా మరిగించాలి.మరిగిన నీటిని వడకట్టి త్రాగాలి.అవసరం అనుకుంటే ఈ ధనియాల టీలో పాలు, పంచదార కూడా వేసుకోవచ్చు.ధనియాల టీ వైరల్ జ్వరం నుండి తొందరగా ఉపశమనం కలిగేలా చేయటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.

తులసి ఆకులు

Telugu Coriander Tea, Problems, Tulsi Tea-Telugu Health

ఒక లీటర్ నీటిలో 20 తులసి ఆకులు, కొంచెం లవంగాల పొడి వేసి ఆ నీరు అర లీటర్ అయ్యేవరకు మరిగించాలి.ఆ నీటిని త్రాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.ఈ మిశ్రమాన్ని రెండు గంటలకు ఒకసారి త్రాగాలి.తులసి,లవంగాల పొడిలో ఉన్న లక్షణాలు జ్వరం తీవ్రతను తగ్గిస్తాయి.

మెంతులు

Telugu Coriander Tea, Problems, Tulsi Tea-Telugu Health

ఒక టేబుల్ స్పూన్ మెంతులను కొంత నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి.ఉదయాన్నే ఆ నీటిని వేరు చేసి తాగాలి.ప్రతి 3 గంటలకు ఓసారి ఈ ద్రవం తాగితే ఫలితం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube