క‌ళ్ళు త‌ర‌చూ మంట ప‌డుతున్నాయా? అయితే ఈ టిప్స్ మీకే!

సాధార‌ణంగా కొంద‌రికి త‌ర‌చూ క‌ళ్ళు మంట పుడుతూ ఉంటాయి.కంప్యూట‌ర్ల ముందు గంట‌లు త‌ర‌బ‌డి వ‌ర్క్ చేయ‌డం, పోష‌కాల లోపం, డీహైడ్రేష‌న్‌, ఆహార‌పు అల‌వాట్లు, దుమ్ము, ధూళి, ఎక్కువ స‌మ‌యం పాటు ఫోన్లు, టీవీల‌తో గ‌డ‌ప‌డం, ఒత్తిడి ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల క‌ళ్ళు మంట ప‌డుతుంటాయి.

 Best Ho Me Remedies To Get Rid Of Burning Eyes-TeluguStop.com

ఈ నేప‌థ్యంలోనే క‌ళ్ళ మంట‌ల‌ను ఎలా నివారించుకోవాలో తెలియ‌క తెగ స‌త‌మ‌త‌మ‌వుతుంటారు.అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ పాటిస్తే.

సుల‌భంగా ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు.మ‌రి ఆలస్యం చేయ‌కుండా ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

 Best Ho Me Remedies To Get Rid Of Burning Eyes-క‌ళ్ళు త‌ర‌చూ మంట పుడుతున్నాయా అయితే ఈ టిప్స్ మీకే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

క‌ళ్ళ మంట‌ను త‌గ్గించ‌డంలో బంగాళ‌దుంప అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.పీల్ తీసిన బంగాళ‌దుంపు తీసుకుని స్లైసులుగా క‌ట్ చేసి గంట పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.ఆ త‌ర్వాత వాటిని తీసుకుని క‌ళ్ళ‌పై ఉంచుకోవాలి.ఇలా చేస్తే.

కొంత స‌మ‌యానికి క‌ళ్ళ మంట‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.ఎగ్స్‌ కూడా క‌ళ్ళ మంట‌ల‌ను త‌గ్గిస్తాయి.ఒక బౌల్‌లో ఎగ్ వైట్ తీసుకుని అందులో కొద్దిగా తేనె వేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని క‌ళ్ళ‌పై అప్లై చేసుకోవాలి.ఇరవై నిమిషాల అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

Telugu Burning Eyes, Eye Care, Eyes, Good Health, Health, Health Tips, Home Remedies, Latest News-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

గులాబీ రేకుల‌ను నీటిలో వేసి క‌ల‌ర్ ఛేంజ్ అయ్యే వ‌ర‌కు మ‌రిగించాలి.ఆ త‌ర్వాత నీటిని వ‌డ‌బోసుకుని చ‌ల్ల‌గా అయిన త‌ర్వాత దూది సాయంతో క‌ళ్ళ‌పై అద్దుకోవాలి.ఇలా చేసినా కూడా క‌ళ్ళ మంట‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు.

అలాగే క‌ళ్ళు మంట‌లు పుడుతున్న‌ప్పుడు కంప్యూటర్, ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్ వంటి గ‌డ్జెట్స్‌ను వాడ‌టం త‌గ్గించండి.

విశ్రాంతి తీసుకోండి.వాట‌ర్ తాగుతూ ఉండండి.

మ‌రియు చ‌ల్ల‌టి నీటితో త‌ర‌చూ క‌ళ్ళ‌ను శుభ్రం చేసుకోండి.ద్వారా మంట‌లు త‌గ్గుతాయి.

#Burning Eyes #Health Tips #Eye Care #Good Health #Home Remedies

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు