ఏ వంట నూనె వాడితే మంచిందంటే..!

ఇప్పటికే మార్కెట్లో వంట నూనెల ధరలు ఆకాశాన్నంటాయి.వివిధ రకాల నూనెలు మనకు తెలుసు.కరోనా నేపథ్యంలో వీటి ధరలు అమాంతం పెరిగాయి.దేశంలో డిమాండ్‌కు తగ్గట్టుగా ప్రొడక్షన్‌ లేకపోవడం మరో కారణం.మనం వాడే నూనెల్లో వేరుశనగ, సన్‌ఫ్లవర్, నువ్వుల నూనె, పామ్‌ ఆయిల్, ఆలివ్‌ ఆయిల్‌ ఇలా చాలా ఉన్నాయి.వీటన్నింటిలో ఏ ఆయిల్‌ వాడితే మన ఆరోగ్యానికి హాని కలగదో ఆ వివరాలు తెలుసుకుందాం.

 Best Cooking Oil, Palmolive Oil, Best Oil For Cooking, Healthy Cooking Oils, Mus-TeluguStop.com
Telugu Benefitsground, Oil, Edible Oils, Healthy Oils, Mud Oil, Palmolive Oil, S

పామ్‌ ఆయిల్‌ వాడటం వల్ల విటమిన్‌ ఏ లోపం నుంచి బయటపడవచ్చు.అదే విధంగా కేన్సర్‌ సంబంధిత వ్యాధులు నివారించేందుకు ఈ ఆయిల్‌ బెస్ట్‌.కొలెస్టరల్‌కు కూడా ఈ నూనె వాడటం వల్ల చెక్‌ పెట్టొచ్చు.అంటే మొత్తంగా బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఆయిల్‌ వాడటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.

Telugu Benefitsground, Oil, Edible Oils, Healthy Oils, Mud Oil, Palmolive Oil, S

వేరుశనగ నూనె వాడటం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.ఇందులో విటమిన్‌ ఈ పుష్కలంగా ఉంటుంది.డయాబెటీస్‌ను నియంత్రించేందుకు ఈ ఆయిల్‌ దోహదపడుతుంది.ఈ ఆయిల్‌ గుండెకు కూడా మంచిది.సోయాబీన్‌ నూనెలో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్‌లు సమృద్ధిగా ఉంటాయి.ఈ నూనెను వాడితే చర్మ సంబంధ వ్యాధులు తగ్గుతాయి.

Telugu Benefitsground, Oil, Edible Oils, Healthy Oils, Mud Oil, Palmolive Oil, S

వంటల్లో ఆవ నూనె వాడటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగవుతుంది.ఇమ్యూనిటీ లెవల్‌ పెరుగుతుంది.దగ్గు, జలుబు, చర్మ సమస్యలున్న వారు ఆవనూనె వాడితే మంచిది.సన్‌ ప్లవర్‌ ఆయిల్‌లో విటమిన్‌ ఈ ఎక్కువగా ఉంటుంది.గుండె,, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.అలాగే, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపడుతుంది.

ఈ ఆయిల్‌లో తక్కువ కొలెస్టరాల్‌ ఉంటుంది.కేన్సర్‌ రోగులు ఈ నూనె వాడితే బెటర్‌.

నువ్వుల నూనె వాడటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.చర్మం కాంతివంతంగా మారి, జుట్టు నిగారింపు పెరుగుతుంది.

ఇదిలా ఉండగా వంట నూనెలు కల్తీవి తయారవుతున్న కేసులను ఇప్పటికే వార్తల్లో చూస్తూనే ఉన్నాం.అందుకే కేవలం బ్రాండెడ్‌ ఆయిల్‌నే వాడాలి.

లోకల్‌ నూనెలు వాడటం వల్ల అవి ఆరోగ్యానికి హానికరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube