పొట్ట బరువుగా ఉన్నట్టు అనిపిస్తే ఆ సమస్య ఉన్నట్టే!

సాధారణంగా ఏదైనా పండుగలు లేదా ప్రత్యేక రోజులలో ఎన్నో రకాల వంటలను తయారు చేస్తుంటారు.అన్ని రకాల వంటలను కొద్ది పరిమాణంలో తిన్నప్పుడు కూడా కొందరికి పొట్ట బరువుగా ఉన్నట్లు అనిపించడం, తిన్న ఆహారం జీర్ణం కాక సతమతమవుతుంటారు.

 Best Health Solutions For Stomach Problems-TeluguStop.com

మరికొందరిలో పొట్ట ఉబ్బరం, గ్యాస్ ఏర్పడటంతో అజీర్తి, గొంతులో మంట వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు.ఇవన్నీ కూడా ఇన్‌ఫ్లమేషన్‌ లక్షణాలే.
సాధారణంగా ఇలాంటి లక్షణాలు ఎక్కువగా మధుమేహం, అధిక రక్తపోటు, పొగ త్రాగడం వంటి అలవాట్లు ఉన్న వారిలో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.అంతేకాకుండా కొద్దిపాటి పరిమాణంలో ఆహారం ఎక్కువగా తీసుకున్నా, దీర్ఘకాలిక సమస్యలకు మందులు వాడుతున్న వారిలో ఈ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

ఇలాంటి లక్షణాలతో బాధపడేవారు వారి ఆహార విషయంలో తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

 Best Health Solutions For Stomach Problems-పొట్ట బరువుగా ఉన్నట్టు అనిపిస్తే ఆ సమస్య ఉన్నట్టే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సమస్యతో బాధపడే వారు వారి ఆహార విషయంలో తగినంత ఉప్పు, కారం తగ్గించాలి.

ఇలాంటి వారు ఎక్కువ మోతాదులో ఆకుకూరలను సేవించాలి.ప్రొటీన్లు అధికంగా లభించే గుడ్లు, మాంసం చేపలను వారంలో కనీసం రెండు సార్లు అయినా తీసుకోవాలి.

వీలైనంత వరకు తీపి పదార్థాలకు దూరంగా ఉండి, ఎక్కువ మోతాదులో పండ్లు కూరగాయలను తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.రోజు మొత్తంలో అధికశాతం నీటిని కూడా తీసుకోవాలి.

నీటిని అధికంగా తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగు పడటమే కాకుండా, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు ఏర్పడవు.

ప్రతిరోజు క్రమం తప్పకుండా గంట సమయం పాటు వ్యాయామం చేయాలి.

రాత్రి భోజనంలో తప్పకుండా పెరుగు ఉండేలా చూసుకోవాలి.ఈవిధమైన ఆహారపు అలవాట్లను చేసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి మెరుగుపడటమే కాకుండా, మన శరీరం బరువుగా కాకుండా, తేలికగా ఉంటుంది.

#GetRid #Lifestyle #Health Problems #BestHealth #Acidity

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు