టీ పొడి లో ఇది కలిపి జుట్టుకి రాస్తే జుట్టు రాలడం తగ్గిపోవడంతో పాటు తెల్ల జుట్టు సమస్య ఉండదు  

టీ పొడి జుట్టుకు చాలా సహాయపడుతుంది. జుట్టు కుదుళ్లను బలంగా చేసి జుట్టు రాలకుండా అరికడుతుంది. అలాగే దెబ్బతిన్న జుట్టును మరల ఆరోగ్యంగా మార్చటంలో కూడా బాగా సహాయపడుతుంది. టీ పొడిని జుట్టుకు రాయటం వలన జుట్టు కుదుళ్ళు బలంగా ఉండి జుట్టు రాలటం తగ్గి ఒత్తుగా పెరగటమే కాకుండా నల్లగా అయ్యేలా చేస్తుంది. అందుకే చాలా మంది తలకు హెన్నా పెట్టినప్పుడు హెన్నాలో టీ డికాషన్ కలుపుతారు. అంతేకాక చాలా బ్యూటీ పార్లర్ లలో జుట్టు కోసం టీ డికాషన్ ని చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

టీ పొడి జుట్టు అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తుంది. టీ డికాషన్ ను తరచుగా జుట్టుకు రాస్తూ ఉంటే తెల్ల జుట్టు వచ్చే సమస్య ఉండదు. అలాగే చిన్న వయస్సులో వచ్చే తెల్ల జుట్టు సమస్య కూడా తొలగిపోతుంది. టీ పొడిలో ఉండే కెఫీన్ జుట్టు రాలే సమస్యను తగ్గించటంలో అద్భుతంగా పనిచేస్తుంది. అయితే టీ పొడి ఎలా వాడాలా అని ఆలోచిస్తున్నారా? జుట్టు బలహీనంగా మారి రాలిపోవడం,పలుచగా అవ్వటం,తెల్ల జుట్టు వస్తున్న ఇప్పుడు చెప్పే విధానాన్ని ఫాలో అవ్వండి.

ఈ చిట్కాకు కావలసినవి టీ పొడి,ఉసిరి పొడి. ఈ రెండు పదార్ధాలు మీ జుట్టు అన్ని సమస్యలు పరిష్కారం అయ్యిపోతాయి. ఉసిరిపొడిలో విటమిన్ సి ఎక్కువగా ఉండుట వలన జుట్టు రాలడాన్ని అరికట్టటంతో పాటు తెల్ల జుట్టును నివారించడంలో సహాయపడుతుంది. టీ డికాషన్ తయారుచేసుకొని చల్లారనివ్వాలి. నాలుగు స్పూన్ల ఉసిరిపొడిలో సరిపడా డికాషన్ వేసి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని రాత్రి కలిపి పెట్టుకొని మరుసటి ఉదయం జుట్టుకు ప్యాక్ గా వేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.

జుట్టుకు షాంపూ అప్లయ్ చేయకూడదు. ఒకవేళ షాంపూ అప్లై చేస్తే అందులోని పోషకాలు జుట్టుకు సరిగా అందవు. అందువల్ల సాధారణ నీటితో శుభ్రం చేసి జుట్టు ఆరిన తర్వాత నూనెను పట్టించాలి. ఆ తర్వాతి రోజు షాంపూ తో తలస్నానము చేయవచ్చు. ఈ ప్యాక్ జుట్టు కుదుళ్లను బలంగా మార్చి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అలాగే జుట్టు ఒత్తుగా,నల్లగా మారటమే కాకుండా తెల్ల జుట్టు రాకుండా కాపాడుతుంది. ఈ ప్యాక్ ని వారానికి ఒకసారి అప్లై చేస్తే మీకు ఉన్న జుట్టు సమస్యలు అన్ని తొలగిపోతాయి.