ఆస్తమా. ప్రపంచవ్యాప్తంగా వయసుతో సంబంధం లేకుండా కొన్ని కోట్ల మంది ఈ సమస్యతో బాధ పడుతున్నారు.దీర్ఘకాలిక శ్వాససంబంధ వ్యాధుల్లో ఆస్తమా ఒకటి.చిన్నపిల్లలు, యుక్త వయసు వారు ఈ వ్యాధి బారిన ఎక్కువగా పడుతుంటారు.ఆస్తమా సమస్య ఉన్న వారు సజావుగా ఊపిరి పీల్చుకోలేరు.ముఖ్యంగా చలి కాలంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది.
ఆస్తమా వ్యాధి ఉన్న వారిలో ప్రధానంగా ఆయాసం, దగ్గు, ఛాతీ నొప్పి, ఏ పని ఎక్కువ సేపు చేయలేకపోవడం, పిల్లికూతలు, తుమ్ములు వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఇక ఈ ఆస్తమా వ్యాధికి సంపూర్ణ చికిత్స అందుబాటులో లేనప్పటికీ.
వ్యాధి తీవ్రత తగ్గించేందుకు మందులు, ఇన్‌హేలర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.అయితే పలు ఆహారాల తీసుకోవాడం ద్వారా ఆస్తమా సమస్య నంచి త్వరగా ఉపశమనం పొందొచ్చు.
అలాంటి వాటిలో అల్లం ఒకటి.ఘాటైన రుచి, వాసన కలిగి ఉండే అల్లంను మనం నిత్యం ఏదో ఒక విధంగా వాడుతూనే ఉంటాము.

ఎన్నో పోషకాలు దాగి ఉన్న అల్లం.గుండె జబ్బులను తగ్గించడంలోనూ, మధుమేహం వ్యాధిని అదుపు చేయడంలోనూ, శరీర రోగ నిరోధక శక్తి పెంచడంలో, రక్త పోటును కంట్రోల్ చేయడంలోనూ ఇలా అనేక విధాలుగా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.అలాగే ఆస్తమా వ్యాధి బాధితులకు కూడా అల్లం గ్రేట్‌గా సహాయపడుతుంది.అల్లం రసాన్ని కొద్దిగా తేనెతో కలిపి తీసుకోవడం లేదా అల్లం ముక్కలను నీటితో వేసి బాగా మరిగించి చల్లారక తీసుకోవడమో చేస్తుండాలి.ఇలా ప్రతి రోజు చేస్తే.అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు పలు రకాల పోషకాలు ఆస్తమా సమస్య నుంచి మంచి ఉపశమనం అందిస్తాయి.
అదే సమయంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.ఇక ఆస్తమా నుంచి త్వరగా రిలీఫ్ అవ్వాలని భావించేవారు.
విటమిన్ డీ ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి.అంటే పాలు, చేపలు, గుడ్లు వంటివి డైట్‌లో చేర్చుకోవాలి.
వీటితో పాటు అరటిపండు, యాపిల్, క్యారెట్, బీట్‌రూట్, ఆకుకూరలు వంటివి తీసుకుంటే మంచిది.
