సావిత్రి చేతిలో ఉన్న ఈ చిన్నారి బాలుడు ఎవరో మీకు తెలుసా..?

తెలుగు, తమిళ సినిమాల్లో నటించి నటిగా సావిత్రి మంచి పేరును, గుర్తింపును సొంతం చేసుకున్నారు.సినిమాల్లో అద్భుతంగా నటించి తన నటనతో మహానటి అనే పేరును సావిత్రి సంపాదించుకున్నారు.

 Best Form The Pase Savitri With Hero Akkineni Nagarjuna In Velugu Needalu Movie,-TeluguStop.com

చిన్నచిన్న పాత్రలతో కెరీర్ ను మొదలుపెట్టి తక్కువ సమయంలోనే ఈమె స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకున్నారు.ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురు కావడంతో సావిత్రి ఒక దశలో పేద జీవితాన్ని గడిపారు.

తెలుగులో అలనాటి స్టార్ హీరోలైన సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో సావిత్రి ఎక్కువ సినిమాల్లో నటించారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో సావిత్రికి సంబంధించిన ఒక అరుదైన ఫోటో తెగ వైరల్ అవుతోంది.

ఈ ఫోటోలో సావిత్రి ఒక బాలుడిని ఎత్తుకొని ఉండగా ఆ బాలుడు ప్రస్తుతం వరుస సినిమాలతో, వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్న అక్కినేని నాగార్జున కావడం గమనార్హం.అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెరకెక్కిన రెండు సినిమాల్లో నాగార్జున నటించారు.

అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ లో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ముఖ్య పాత్రల్లో వెలుగునీడలు సినిమా తెరకెక్కింది.

Telugu Bangarraju, Nagarjuna, Nagarjunachild, Sudigundalu, Velugu Needalu-Movie

ఈ సినిమాలో బాలనటుడిగా నాగార్జున నటించగా షూటింగ్ సమయంలో నాగార్జున దిగిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.ఈ సినిమా షూటింగ్ జరిగిన సమయంలో నాగార్జున వయస్సు కేవలం 8 నెలలు కావడం గమనార్హం.ఆ తర్వాత సుడిగుండాలు అనే సినిమాలో కూడా నాగార్జున బాలనటుడిగా నటించి మెప్పించారు.

Telugu Bangarraju, Nagarjuna, Nagarjunachild, Sudigundalu, Velugu Needalu-Movie

చల్లని వెన్నెల సోయలు అనే పాట కొరకు ఏఎన్నార్, సావిత్రి నాగార్జునను ఎత్తుకున్నారు.బాలనటుడిగానే విజయాలను అందుకున్న నాగార్జున వయస్సు పెరిగి పెద్దైన తర్వాత విభిన్నమైన కథలను ఎంచుకోవడంతో పాటు కొత్త డైరెక్టర్లకు అవకాశాలను ఇస్తూ స్టార్ హీరో స్టేటస్ ను అందుకున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం నాగార్జున బంగార్రాజు సినిమాలో నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube