ఈ ఆహారాలు తింటే జుట్టు రాలే సమస్యకు గుడ్ బై ?       2018-04-30   01:37:33  IST  Lakshmi P

ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా,ఆడ,మగ అనే తేడా లేకుండా జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. అలాగే జుట్టు రాలడానికి మన ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణం అని చెప్పాలి. మన ఆహారంలో కొన్ని మార్పులను చేసుకుంటే జుట్టు రాలే సమస్య నుండి సక్సెస్ గా బయట పడవచ్చు. ఆ ఆహారాల గురించి వివరంగా తెలుసుకుందాం.

క్యారెట్
క్యారెట్ లో విటమిన్ A సమృద్ధిగా ఉండుట వలన సహజమైన కండిషనర్ గా పనిచేస్తుంది. ప్రతి రోజు క్యారెట్ ని ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది.

అవిసె గింజలు
అవిసె గింజలలో ఒమేగ 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండుట వలన జుట్టు అవసరమైన పోషణను అందిస్తుంది. జుట్టుకు సాగె గుణాన్ని కలిగించి జుట్టు తెగకుండా ఉండేలా చేస్తుంది.

బార్లీ
బార్లీలో విటమిన్ E సమృద్ధిగా ఉండుట వలన జుట్టు రాలకుండా అరికడుతుంది. అంతేకాక బార్లీలో ఉండే ఐరన్ , కాపర్ జుట్టు కుదుళ్లను బలంగా ఉంచుతాయి.

పప్పు ధాన్యాలు
పప్పు ధాన్యాలలో ప్రొటీన్లు, ఐరన్,జింక్ మరియు బయోటిన్,ఫోలిక్ ఆమ్లం సమృద్ధిగా ఉంటాయి. పప్పు ధాన్యాలలో ఉండే ఫోలిక్ యాసిడ్ ఎర్ర రక్త కణాల పనితీరు మెరుగుపరచి, మాడుపై ఉండే చర్మానికి రక్త ప్రసరణ మరియు ఆక్సిజన్ ల సరఫరాను పెంపొందిస్తుంది. దీని వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది.

జామ కాయ
జామకాయలో విటమిన్ B,C సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ C జుట్టు పెళుసుగా మారకుండా చేస్తుంది. అంతేకాక కొల్లాజిన్ ఉత్పత్తిని పెంచి జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది.