ఈ ఆహారాలు తీసుకుంటే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది  

Best Foods For Your Skin -

చర్మం పొడిబారి కాంతివిహీనంగా ఉంటే ఎవరికీ నచ్చదు.అందుకే ప్రతి ఒక్కరు చర్మం కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు.

చర్మం కాంతివంతంగా,మృదువుగా ఉండటానికి అనేక రకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు.ఆలా కాకుండా ప్రతి రోజు కొన్ని ఆహారాలను తీసుకుంటూ ఉంటే చర్మం కాంతివంతంగా,మృదువుగా మారుతుంది.

Best Foods For Your Skin -

అంతేకాకుండా మొటిమల కారణంగా వచ్చే మచ్చలు కూడా తొలగిపోతాయి.ఇప్పుడు ఆ ఆహారాల గురించి తెలుసుకుందాం.

పాలకూర పాలకూరలో విటమిన్‌ ఎ, బీటా కెరాటిన్‌లు సమృద్ధిగా ఉండుట వలన వృద్దాప్య లక్షణాలు రాకుండా అడ్డుకుంటాయి.ప్రతి రోజు పాలకూరను ఆహారంలో తీసుకుంటే నలభైలో కూడా చర్మం ముడతలు లేకుండా కాంతివంతంగా ఉంటుంది.

సబ్జా గింజలు
సబ్జా గింజలలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉండుట వలన చర్మ సంరక్షణలో బాగా సహాయపడతాయి.

టమోటా
టమోటాలలో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ చర్మానికి మెరుపును ఇస్తుంది.టమోటాలో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు హానికార‌క సూర్య కిర‌ణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.

బాదం పప్పు
బాదం పప్పులో చర్మ సంరక్షణలో సహాయపడే విటమిన్‌ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

ప్రతి రోజూ నాలుగు బాదం పప్పుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే చాలా మంచిది.

కీర దోస
కీర‌ దోసకాయను తొక్క‌తో తినడం మంచిది.

తొక్క‌లో విటమిన్‌ కె సమృద్ధిగా ఉంటుంది.చర్మానికి మేలు చేసే గుణం కీర‌దోస తొక్క‌లో ఉంది.

కీర‌దోసకాయ మంచిది కదా అని ఊరగాయల రూపంలో తినకూడదు.కీరదోసకాయ రసాన్ని ముఖానికి పట్టిస్తే నల్లని మచ్చలు తొలగిపోతాయి.

తాజా వార్తలు