అందమైన,ఆరోగ్యమైన కళ్ళకు అద్భుతమైన ఆహారాలు  

  • కళ్ళు అందంగా,ఆరోగ్యంగా కనపడితే ముఖం కూడా కాంతిగా మెరుస్తూ ఉంటుంది. ఆరోగ్యకర ఆహారం, మంచి నిద్ర, కొన్ని సహజ వైద్యాలు మీ కళ్ళకు మంటలు, ఎరుపు ఇతర అసౌకర్యాలను దూరంగా వుంచుతాయి. కళ్ళు అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలను తీసుకోవాలి. ఆ ఆహారాల గురించి వివరంగా తెలుసుకుందాం.

  • కంటి ఆరోగ్యానికి అవసరమైన ఎ,ఇ, సి విటమిన్స్ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఈ విటమిన్స్ సమృద్ధిగా లభించే కేరట్లు, ఆపిల్స్, కివి పండు, విటమిన్ సి పండ్లు అయిన ఆరెంజ్, బత్తాయి, నిమ్మ, రేగుపండ్లను తింటూ ఉండాలి.

  • Best Foods For Healthy And Beautiful Eyes-

    Best Foods For Healthy And Beautiful Eyes

  • కళ్ళు ఒత్తిడికి గురి కాకుండా ఉండటానికి కంటి మీద కీరా దోస ముక్క లేదా బంగాళాదుంప ముక్కలను పెట్టుకొని పావుగంట సేపు ఆలా ఉండాలి. దాంతో కళ్ళ మీద ఒత్తిడి,అలసట మాయం అయ్యిపోతాయి.

  • విటమిన్ A సమృద్ధిగా లభించే బాదం పప్పులు, ఖర్జూరాలు, సోయా బీన్స్, గ్రీన్ బఠాణీలు తింటూ ఉంటె కంటి ఆరోగ్యం బాగుంటుంది.

  • పచ్చని ఆకుకూరలను రెగ్యులర్ గా తీసుకుంటే రక్త ప్రసరణ బాగా పెరిగి కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.

  • పాల ఉత్పత్తులైన, వెన్న, పాలు, జున్ను, మజ్జిగ మొదలైనవి కూడా కంటికి మంచివి. అవి కళ్ళ ఒత్తిడిని తగ్గిస్తాయి.

  • ఈ విధంగా మంచి పోషకాహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ దుమ్ము నుండి రక్షణ కలిగి ఉంటే సరిపోతుంది. ఈ ఆహారాలను తింటూ ఈ చిట్కాలను పాటిస్తే కళ్ళు అందంగా,ఆరోగ్యంగా ఉంటాయి.