న‌రాల వీక్‌నెస్‌తో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఈ ఫుడ్స్ మీకే!

న‌రాల వీక్ నెస్‌ పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మందిలో క‌నిపించే స‌మ‌స్య ఇది.న‌రాల బ‌ల‌హీన‌త ఉన్న వారిలో ఏ చిన్న బరువు లేపినా చేతులు జివ్వున లాగేయడం, ఏదైనా ప‌ని చేసినా.

 Best Foods For Get Rid Of Nerve Weakness-TeluguStop.com

కాసేపు న‌డిచినా వ‌ణుకు రావ‌డం, తీవ్ర అల‌స‌ట‌, తిమ్ముర్లు ఇలా ర‌క‌ర‌కాల ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటాయి.వీటిని నిర్ల‌క్ష్యం చేయ‌కుండా స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకుంటే న‌రాల వీక్ సెన్ స‌మ‌స్య‌ను నివారించుకోవ‌చ్చు.

ముఖ్యంగా కొన్ని కొన్ని ఆహారాలు న‌రాల వీక్ నెస్ ను త‌గ్గించ‌డంలో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 Best Foods For Get Rid Of Nerve Weakness-న‌రాల వీక్‌నెస్‌తో బాధ‌ప‌డుతున్నారా అయితే ఈ ఫుడ్స్ మీకే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సీఫుడ్ అంటే చేప‌లు, రొయ్య‌లు, పీత‌లు వంటివి వారంలో రెండు సార్లు త‌ప్ప‌కుండా తీసుకోవాలి.ఎందుకంటే సీఫుడ్‌లో ప్రోటీన్‌, విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌తో పాటు ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్‌, అమైనో యాసిడ్స్ కూడా నిండి ఉంటాయి.

ఇవి నాడీ వ్యవస్థ బ‌లోపేతం చేసి న‌రాల బ‌ల‌హీన‌త‌ను త‌గ్గిస్తాయి.

న‌రాల వీక్ నెస్‌ను నివారించ‌డంలో ఆకుకూర‌లు కూడా అద్భుతంగా స‌హ‌య‌ప‌డ‌తాయి.అందువ‌ల్ల‌, ప్ర‌తి రోజు తీసుకునే ఆహ‌రంలో ఏదో ఒక ఆకుకూర ఉండేలా చూసుకోవాలి.బాదం, ఆప్రికాట్స్‌, జీడి ప‌ప్పు, వాల్ న‌ట్స్, పిస్తా వంటి న‌ట్స్‌ను రెగ్యుల‌ర్ డైట్‌లో చేర్చుకుంటే.

వాటిలో ఉండే పోష‌క విలువ‌ల నరాలు బలహీనతకు నివారణగా పని చేస్తాయి. గ్రీన్ టీ, బ్లాక్ టీ, డార్క్ చాక్లెట్స్‌, స్ట్రాబెరీలు, బ్లూబెరీలు, పాలు, పాల ఉత్ప‌త్తులు, గుడ్లు, ప‌ప్పు ధాన్యాలు వంటివి కూడా న‌రాల వీక్ నెస్‌కు చెక్ పెట్ట‌గ‌ల‌వు.

వీటితో పాటుగా రోజుకు ఇర‌వై, ముప్పై నిమిషాలు అయినా వ్యాయామాలు, యోగా వంటివి చేయాలి.అలాగే నిద్ర లేక‌పోయినా న‌రాలు బ‌ల‌హీన ప‌డ‌తాయి.

కాబ‌ట్టి, ప్ర‌తి రోజు ఏడు నుంచి ఎనిమిది గంట‌లు నిద్రించాలి.ఇక న‌రాల బ‌ల‌హీన‌త నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందించ‌డంలో వాటర్ థెరపీ కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.దీన్ని కూడా ట్రై చేస్తే మంచిది.

#Nuts #Foods #Dark Chocolate #Health #Sea Food

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు