శాకాహారులా? క‌రోనా బారిన ప‌డ్డారా? అయితే ఇవి తీసుకోండి!

ప్ర‌స్తుతం దేశంలో ఎక్క‌డ చూసినా క‌రోనా మాటే వినిపిస్తోంది.సద్దు మణిగిందనుకున్న ఈ మాయ‌దారి వైర‌స్ మ‌ళ్లీ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో విజృంభిస్తూ ప్ర‌జ‌ల‌ను ముప్ప తిప్ప‌లు పెడుతోంది.

 Best Food For Vegetarians In Corona Time-TeluguStop.com

కంటికి క‌నిపించ‌ని ఈ శ‌త్రువు ఏ వైపు నుంచి ఎటాక్ చేస్తుందో అంతు ప‌ట్ట‌డం లేదు.అయితే క‌రోనా సోకినాదానికి లొంగ కుండా ఉండాలంటే మ‌నం ఆరోగ్యంగా, పుష్టిగా ఉండాల్సి ఉంటుంది.

అలా ఉండాలి అంటే ఖ‌చ్చితంగా మంచి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.

 Best Food For Vegetarians In Corona Time-శాకాహారులా క‌రోనా బారిన ప‌డ్డారా అయితే ఇవి తీసుకోండి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముఖ్యంగా క‌రోనా నుంచి త్వ‌ర‌గా కోలుకోవాలంటే ప్ర‌తి రోజు చికిన్, గుడ్లు, చేప‌లు తీసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే, వీటిలో ప్రోటీన్ పుష్క‌లంగా ఉంటుంది.ఇది క‌రోనాను జ‌యించేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

కానీ, శాకాహారులు నాన్ వెజ్ తీసుకోవాడానికి ఇష్ట‌ప‌డ‌రు.మ‌రి వాటి బ‌దులుగా ఏ ఫుడ్స్ తీసుకోవాలి ఏవి తీసుకుంటే క‌రోనా నుంచి త్వ‌ర‌గా కోలుకుంటారు అన్న‌వి ఇప్పుడు తెలుసుకుందాం.

శాకాహారులు గుడ్లు, చేప‌లు, చికిన్ వంటి వాటిని ఎలాగో తిన‌రు కాబ‌ట్టి, వాటి బ‌దులుగా పప్పు దినుసులు తినాల్సి ఉంటుంది.ముఖ్యంగా కందిపప్పు, పెసర, మినపప్పు లాంటివి తీసుకుంటే శ‌రీరానికి ప్రోటీన్ అందుతుంది.

అలాగే పాలు, పెరుగు, నెయ్యి, ప‌న్నీర్‌ వంటివి తీసుకోవాలి.శాకాహారులు ప్ర‌తి రోజు మొల‌క‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

మొలకల్లో ఉండే బోలెడ‌న్ని విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి ఎంతో మేలు కలగ‌చేస్తాయి.ఎన్నో జ‌బ్బుల‌ను దూరం చేస్తారు.

ఇమ్యూనిటీ సిస్ట‌మ్‌ను బ‌ల‌ప‌డేలా చేస్తాయి.

ఇక క‌రోనాను చేయించాలంటే విట‌మిన్స్ ఎంతో అవ‌స‌రం.అందువ‌ల్లు, విట‌మిన్స్ పుష్క‌లంగా ఉండే కివి ఫ్రూట్, బెర్రీస్, దానిమ్మ, క‌మ‌లాలు, నిమ్మకాయలు, బ్రకోలీ, టమాటాలు, క్యారెట్‌, కాప్సికం, ఉసిరికాయలు వంటివి డైట్‌లో ఉండేలా చేసుకోవాలి.అలాగే రెగ్య‌లుర్‌గా నట్స్ తీసుకోవాలి.

నిద్రపోయే ముందు తప్పని సరిగా పాలల్లో పసుపు కలిపినవి తాగాలి.అల్లం, వెల్లుల్లి, జీల‌క‌ర్ర‌, మిరియాలు, పుదీనా ఇలాంటి ప్ర‌తి రోజు ఏదో ఒక రూపంలో తీసుకోవాలి.

మ‌రియు వ్యాయామం కూడా చేయాలి.త‌ద్వారా శాకాహారులు కూడా త్వ‌ర‌గా క‌రోనా బారి నుంచి బ‌య‌ట ప‌డొచ్చు.

#COVID #Foods #Vegetarians #Tips #Corona Virus

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు