థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేయాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి  

ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు.ఈ సమస్యలు హైపో, హైపర్ థైరాయిడిజం అనే రెండు రకాలుగా ఉంటుంది.

దీని కారణంగా అనేక రకాల అనారోగ్యాలు కలుగుతాయి.ఈ సమస్యల నుండి బయటపడాలంటే కొన్ని ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి.

-

ఇప్పుడు చెప్పబోయే ఆహారాలను ప్రతి రోజు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే ఈ సమస్య నుండి చాలా సులభంగా బయట పడవచ్చు.

పెరుగు

పెరుగులో విటమిన్ డి, ప్రొబయోటిక్స్ సమృద్ధిగా ఉండుట వలన థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేసేలా చేస్తుంది.అంతేకాక జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను పెంపొందించటం వలన థైరాయిడ్ గ్రంథిలో ఉండే అసమానతలను తొలగిస్తుంది.

చేపలు

శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకం ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు చేపలతో సమృద్ధిగా ఉంటుంది.ఇవి జీర్ణక్రియను క్రమబద్దీకరిస్తాయి.దాంతో థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ లో మన శరీర జీవక్రియలో కీలకమైన పాత్రను పోషించే డైటరీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన జీవక్రియను క్రమబద్దీకరిస్తాయి.దాంతో థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది.

గ్రీన్ టీ

గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో అనవసర కొవ్వు కణాలను బయటకు విడుదల చేస్తాయి.ఈ విధంగా కొవ్వు కరగటం వలన, ఈ కొవ్వును లివర్ శక్తిగా మారుస్తుంది.

దాంతో జీవక్రియ క్రమబద్దీకరణ జరిగి థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది.

తాజా వార్తలు